Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ 5 తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట .. అవి ఏమిటంటే..
ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గరుడ పురాణంలో ఇలాంటి అనేక సమాచారం ఇవ్వబడింది. అంతే కాదు ఒక వ్యక్తి తన జీవితానికి బాధ్యత వహిస్తాడని గరుడ పురాణంలో కూడా వివరించబడింది. ఈ పురాణంలో జీవించడానికి కొన్ని నియమాలు కూడా ప్రస్తావించబడ్డాయి. జీవితంలో మనం ఎప్పుడు ఏ పనులు చేయాలి.. ఏ పని చేయకూడనే విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణంలో మనుషులు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు ఆయుష్షుని తగ్గిస్తాయని పేర్కొన్నది.
హిందూ పురాణ మత గ్రంథాల్లో అనేక జీవన విధానాలు పేర్కొనబడ్డాయి. వీటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవచ్చు. గరుడ పురాణం హిందూ మతంలోని 18 పురాణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని అధి దేవత విష్ణువు. ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గరుడ పురాణంలో ఇలాంటి అనేక సమాచారం ఇవ్వబడింది. అంతే కాదు ఒక వ్యక్తి తన జీవితానికి బాధ్యత వహిస్తాడని గరుడ పురాణంలో కూడా వివరించబడింది. ఈ పురాణంలో జీవించడానికి కొన్ని నియమాలు కూడా ప్రస్తావించబడ్డాయి. జీవితంలో మనం ఎప్పుడు ఏ పనులు చేయాలి.. ఏ పని చేయకూడనే విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణంలో మనుషులు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు ఆయుష్షుని తగ్గిస్తాయని పేర్కొన్నది.
గరుడ పురాణం ప్రకారం ఏమి చేయకూడదంటే
శ్మశాన వాటిక పొగకు దూరంగా ఉండండి – గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి మృత దేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేసినటప్పుడు .. వెలువడే పొగకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మృతదేహం కాలే సమయంలో పొగతో పాటు విషపూరితమైన అంశాలు వాతావరణంలోకి వ్యాపిస్తాయి. ఈ విషపూరిత మూలకాలలో అనేక రకాల వైరస్ లు, బాక్టీరియా ఉంటాయి. ఇవి సమీపంలో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోవడం – గరుడ పురాణం ప్రకారం దీర్ఘాయుష్షు పొందాలనుకుంటే ఉదయం లేవకుండా.. బారెడు పొద్దే వరకూ నిద్రపోయే అలవాటు ఉంటే ఆ అలవాటును మార్చుకోండి. పురాణ గ్రంధాలలో బ్రహ్మ ముహూర్తంలో మేల్కొవడం ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నాయి. ఉదయం వీచే గాలి స్వచ్ఛమైనది. ఈ గాలి మానవులను అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
రాత్రిపూట పెరుగు తినడం – గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట పెరుగు లేదా పెరుగుతో చేసిన వస్తువులను ఎప్పుడూ తినకూడదు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఇది మనిషి జీవితకాలంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా రాత్రి మిగిలిపోయిన మాంసాహారాన్ని తినకూడదు.
నిద్రించడానికి సరైన మార్గం – దక్షిణం లేదా పడమర దిశ వంటి తప్పు దిశలో తలపెట్టి నిద్రించడం వ్యక్తి ఆయుష్షును తగ్గిస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది. గదిలోకి ప్రవేశించినప్పుడు.. ఆ గదిలో కొద్దిగా కాంతి ఉండాలి.. అయితే మంచం మీద పడుకున్న తర్వాత గది చీకటిగా ఉండాలి. అంతేకాదు విరిగిన మంచంపై నిద్రపోవడం మంచిది కాదని పేర్కొన్నాయి గ్రంథాలు.
ఈ మార్గాన్ని అవలంబించవద్దు – గరుడ పురాణం ప్రకారం తప్పుడు చర్య చేస్తే కలిగే పరిణామాలు తెలిసినప్పటికీ తప్పు మార్గంలో ఉన్న వ్యక్తి పాపాలకు పాల్పడుతూనే ఉంటాడు. అదే సమయంలో స్త్రీలు, పిల్లలు, మానవత్వం పట్ల తప్పుడు ఆలోచనలు ఉన్నవారు.. తమ ఆయుష్షును తామే తగ్గించుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు