TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లను పొందాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనుంది. ఇందు కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లను పొందాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనుంది. ఇందు కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ములు చెల్లించి లక్కీడిప్‌లో మంజూరైన టికెట్లను పొందాల్సి ఉంటుంది. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ సహా వివిధ సేవలను ఉపయోగించుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
- మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాతో పాటు శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
- మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలతో పాటు వర్చువల్ దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.
- మే 23న ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.
- మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
- మే 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- మే 24న ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- తిరుమలలో గదుల కోటా విడుదల
- తిరుమల తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
- మే 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ కోటా ను రిలీజ్ చేయనుండగా.. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను… మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..