Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahma Muhuratam: అకస్మాత్తుగా బ్రహ్మ ముహర్తంలో 3 గంటలకు మెలకువ వస్తుందా.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..

తెల్లవారుజామున 3 నుంచి 4:30 గంటల మధ్య సమయాన్ని దేవతల కాలం.. బ్రహ్మముహర్తంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎవరికైనా సడెన్ గా మేలకువ వస్తే.. సృష్టి, దైవిక శక్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించాలని సూచిస్తున్నాయి. భగవంతుడి నామాన్ని జపించాలి. హిందూ మతంలో బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బ్రహ్మ అంటే దేవుడు. ముహూర్తం అంటే సమయం. అంటే బ్రహ్మ ముహూర్తం భగవంతుని సమయం. ఈ శుభ సమయంలో శరీరంలో కొత్త శక్తి, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. అలాగే ఈ సమయంలో సానుకూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది.

Brahma Muhuratam: అకస్మాత్తుగా బ్రహ్మ ముహర్తంలో 3 గంటలకు మెలకువ వస్తుందా.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..
Brahma Muhuratam
Surya Kala
|

Updated on: May 25, 2024 | 3:22 PM

Share

మీకు ప్రతిరోజూ తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో హటాత్తుగా మెలకువ వస్తే అది ఏదైనా దైవిక సంకేతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఏదో ఒక దైవిక శక్తి మీకు సందేశం ఇవ్వాలనుకుంటుందని.. ఏదైనా వివరించాలని కోరుకుంటుందని పెద్దల నమ్మకం. తెల్లవారుజామున 3 నుంచి 4:30 గంటల మధ్య సమయాన్ని దేవతల కాలం.. బ్రహ్మముహర్తంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎవరికైనా సడెన్ గా మేలకువ వస్తే.. సృష్టి, దైవిక శక్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించాలని సూచిస్తున్నాయి. భగవంతుడి నామాన్ని జపించాలి.

బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత

హిందూ మతంలో బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బ్రహ్మ అంటే దేవుడు. ముహూర్తం అంటే సమయం. అంటే బ్రహ్మ ముహూర్తం భగవంతుని సమయం. ఈ శుభ సమయంలో శరీరంలో కొత్త శక్తి, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. అలాగే ఈ సమయంలో సానుకూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో సకల దేవతలు భూమిపై ప్రయాణిస్తారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనిని చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

దైవిక శక్తులు, వాటి సంకేతాలు

ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని భగవంతుడిని స్మరించాలి. ఇలా చేయడం వలన దైవిక శక్తి అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహార్తంలో ప్రకృతి సానుకూల ప్రకంపనలతో నిండిఉంటుంది ఈ సమయంలో భగవంతుడి తలచుకోవడం వలన మిమ్మల్ని ఆరోగ్యవంతం చేస్తుంది. హృదయం భక్తితో నిండి ఉంటుంది. సంపద కలుగుతుంది. ఉదయాన్నే నిద్రలేచి పూజ చేస్తే శరీరంలో అనేక శక్తులు నివసించడం ప్రారంభిస్తాయి. ఈ సంకేతాలన్నీ దైవిక శక్తి ద్వారా ఇవ్వబడతాయి. దైవిక శక్తులు దైవానుగ్రహం, ఆరోగ్యం ఏది కావాలన్నా ఉదయాన్నే మేల్కొనాల్సిందే.

పొరపాటున కూడా ఈ పని చేయకండి

పొరపాటున కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన వెంటనే ఆహారం తినకూడదు. ఇలా చేయడం ఆరోగ్య పరంగా కూడా తప్పుగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ముఖ్యమైన ప్రణాళికలను వేయడానికి ఈ సమయం చాలా సరైనదిగా పరిగణించబడుతుంది. కనుక బ్రహ్మ ముహూర్త సమయంలో మనస్సులో ప్రతికూల భావాలను ఎప్పుడూ తీసుకురాకూడదు. లేకపోతే రోజంతా ఒత్తిడికి గురవుతారు. ఇది మానసిక సమస్యలను కూడా కలిగిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు