- Telugu News Photo Gallery Which corner of the house will double the money? check here is details in Telugu
Vastu Tips: ఇంట్లో డబ్బును ఏ మూలలో ఉంచితే.. ధనం రెట్టింపు అవుతుంది?
ప్రతీ ఒక్కరూ సంపదను పెంచుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే అది అందరికీ కలిసి రాదు. కొందరు చూస్తుండగానే ధనవంతులు అయిపోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎంత కష్ట పడినా.. అక్కడే ఉంటారు. దీంతో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. సంపదను పెంచుకునే విషయంలో వాస్తు శాస్త్రం మీకు చక్కగా సహాయ పడుతుంది. ఇంట్లోని ఏ మూలలో లక్ష్మీ దేవిని ఉంచితే.. డబ్బును ఆకర్షిస్తుందో తెలుసుకోవాలి. ఇంట్లో డబ్బును ఎక్కడ..
Updated on: May 25, 2024 | 4:40 PM

ప్రతీ ఒక్కరూ సంపదను పెంచుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే అది అందరికీ కలిసి రాదు. కొందరు చూస్తుండగానే ధనవంతులు అయిపోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎంత కష్ట పడినా.. అక్కడే ఉంటారు. దీంతో చాలా మంది బాధ పడుతూ ఉంటారు.

సంపదను పెంచుకునే విషయంలో వాస్తు శాస్త్రం మీకు చక్కగా సహాయ పడుతుంది. ఇంట్లోని ఏ మూలలో లక్ష్మీ దేవిని ఉంచితే.. డబ్బును ఆకర్షిస్తుందో తెలుసుకోవాలి. ఇంట్లో డబ్బును ఎక్కడ పెడుతున్నాం అన్నది కూడా ముఖ్యమే.

వాస్తు శాస్త్రం ప్రకారం.. కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. ఆ స్థానంలో డబ్బును దాచుకునే కబోర్డ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు సంపద నిలబడుతుంది. దక్షిణం వైపు కబోర్డ్ ఉంటే.. అది ఉత్తరాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మంచిది.

తూర్పు దిక్కు కూడా చాలా పవిత్రం. కాబట్టి మీ ఇంట్లో తూర్పు దిక్కున కూడా డబ్బు, బంగారం దాచుకునేందుకు ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు దిక్కులో మీరు ధనాన్ని, బంగారాన్ని ఉంచితే.. ఎక్కువగా ఇంటి తలుపులు తెరచి ఉంచాలి. అప్పుడే ధనాకర్షణ పెరుగుతుంది.

అదే విధంగా ధనాన్ని దాచి పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. డబ్బును దాచే ప్రదేశంలో దుమ్ము, చెత్త లాంటివి ఉండకుండా.. శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది. డబ్బుకు విలువను ఇవ్వాలి.




