Movie Updates: రామాయణ పేరు మారుతుందా? రెండు భాగాలుగా మిరాయ్..

రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా బాలీవుడ్ మేకర్‌ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ తొలిసారిగా ఓటు వేశారు. ప్రాణ్‌దీప్ ఠాకూర్ దర్శకత్వంలో రక్షణ అనే సినిమా చేసారు పాయల్ రాజ్‌పుత్.  తేజా సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా మిరాయ్. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. 

| Edited By: Prudvi Battula

Updated on: May 25, 2024 | 4:19 PM

రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా బాలీవుడ్ మేకర్‌ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రావణాసురుడిగా నటిస్తున్నారు యష్‌. ఆయన పాత్ర కోసం వాడే దుస్తులు, ఆభరణాలు, వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవే అని బాలీవుడ్‌ సమాచారం.

1 / 5
బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నువ్విలా సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయిన యామీ, బాలీవుడ్‌లో ఉరి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఉరి సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ... ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తూనే ప్రొఫెషనల్ కెరీర్‌ను కూడా కంటిన్యూ చేస్తున్నారు.

2 / 5
 బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ తొలిసారిగా ఓటు వేశారు. ఇటీవల భారత పౌరసత్వాన్ని తిరిగి పొందిన తరువాత సోమవారం జరిగిన పోలింగ్‌లో తొలిసారిగా ఓటు వేశారు అక్షయ్‌ కుమార్. గతంలో అక్షయ్ పౌరసత్వం విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. దీంతో కెనడా పౌరసత్వాన్ని వదులుకొని ఇండియన్ సిటిజెన్‌షిప్ తీసుకున్నారు కిలాడీ హీరో.

3 / 5
ప్రాణ్‌దీప్ ఠాకూర్ దర్శకత్వంలో రక్షణ అనే సినిమా చేసారు పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా విషయంలోనే అసలు వివాదం మొదలైంది. ప్రమోషన్స్‌కు రమ్మంటే రావట్లేదని... అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని.. పైగా ఇది తన స్థాయి సినిమా కాదు.. ఓటిటిలో రిలీజ్ చేసుకోవాలంటూ చెప్తున్నారంటూ పాయల్‌పై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసారు మేకర్స్.

4 / 5
తేజా సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా మిరాయ్. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో ప్రతినాయకుడిగా మంచు మనోజ్ నటిస్తున్నారు. ఈయన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్రిల్ 18, 2025న విడుదల కానుంది మిరాయ్. దీన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని.

5 / 5
Follow us