- Telugu News Photo Gallery Cinema photos Vijay Devarakonda gets a series of film offers regardless of the results of the films
Vijay Devarakonda: విజయ్ కోసం నిర్మాతలు క్యూ.. ఇన్ని సినిమాలు బ్యాలెన్స్ చేయగలరా..?
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? ఏ నిర్మాత చూసినా తమ నెక్ట్స్ సినిమా రౌడీహీరోతోనే అంటూ ప్రకటిస్తున్నారు. మరి ఇన్ని సినిమాలు ఒకేసారి విజయ్ బ్యాలెన్స్ చేయగలరా..? ఎవరికోసం ఎవర్ని పక్కనబెడతారు..? తాజాగా సుకుమార్ సినిమా కూడా ఉందంటున్నారు. మరి దీని సంగతేంటి..? నిజంగానే ఉందా లేదంటే నోటి మాటతో సరిపెట్టేస్తారా..?
Updated on: May 25, 2024 | 4:58 PM

ముందు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరస అవకాశాలు అందుకునే హీరో విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేకపోయినా.. ఈయన క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. అగ్ర నిర్మాతల నుంచి వరసగా అవకాశం అందుకుంటూనే ఉన్నారు.

ప్రస్తుతం దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో సినిమాలు చేస్తున్నారు విజయ్.విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాపై ఫోకస్ చేసారు. ఈ చిత్ర షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది.

ఇది సెట్స్‌పై ఉండగానే రవికిరణ్ కోలా, రాహుల్ సంక్రీత్యన్ సినిమాలు ప్రకటించారు నిర్మాతలు. వీటిలో రవికిరణ్ సినిమాను దిల్ రాజు.. రాహుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఈ రెండూ భారీ బడ్జెట్‌తోనే రాబోతున్నాయి.

అప్పుడెప్పుడో కరోనా టైమ్‌లో సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమాను ప్రకటించారు నిర్మాత కేదార్ సెలగంశెట్టి. ఆ తర్వాత మళ్లీ దానిపై ఊసే లేదు. కానీ ఇప్పుడు అదే నిర్మాత ఆనంద్ దేవరకొండతో గంగం గణేశా సినిమా నిర్మించారు. విజయ్, సుక్కు సినిమా ఆగిపోలేదని ప్రకటించారు. ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు లెక్కల మాస్టారు.

ఆగస్ట్ 15న పుష్ప 2 విడుదల కానుంది. దాని తర్వాత రామ్ చరణ్ సినిమా లైన్‌లో ఉంది. ఇది పూర్తవ్వడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. ఈ లోపు గౌతమ్ తిన్ననూరి, రాహుల్, రవికిరణ్ సినిమాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు విజయ్. అదే జరిగితే 2026లో విజయ్ దేవరకొండ, సుకుమార్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి. చూడాలిక.. ఏం జరుగుతుందో..?




