- Telugu News Photo Gallery Cinema photos Kalki 2898 AD director Nag Ashwin confident of getting back investment made in it
Kalki 2898 AD: కల్కి హిట్ కాదు సూపర్ హిట్ అవ్వాలి అంటున్న అభిమానులు.. డైరక్టర్ ఏమన్నాడంటే ??
తమ అభిమాన హీరో నుంచి సినిమా వస్తుందంటే, అది కచ్చితంగా సూపర్‌డూపర్ హిట్ కావాలనే కోరుకుంటారు ఫ్యాన్స్. అయితే డార్లింగ్ ప్రభాస్ విషయంలో మాత్రం కోరికలు అంతకు మించి వినిపిస్తున్నాయి. ఇప్పుడు జస్ట్ హిట్, సూపర్‌హిట్ ఇస్తే సరిపోదని అంటున్నారు అభిమానులు. అంతకు మించి కావాలని డైరక్టర్ నాగీ త్రూ రిక్వెస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏంటవి? కల్కి సినిమా రిలీజ్ డేట్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కోవిడ్ ముందు నుంచీ వినిపిస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కల్కి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: May 25, 2024 | 2:20 PM

తమ అభిమాన హీరో నుంచి సినిమా వస్తుందంటే, అది కచ్చితంగా సూపర్‌డూపర్ హిట్ కావాలనే కోరుకుంటారు ఫ్యాన్స్. అయితే డార్లింగ్ ప్రభాస్ విషయంలో మాత్రం కోరికలు అంతకు మించి వినిపిస్తున్నాయి. ఇప్పుడు జస్ట్ హిట్, సూపర్‌హిట్ ఇస్తే సరిపోదని అంటున్నారు అభిమానులు. అంతకు మించి కావాలని డైరక్టర్ నాగీ త్రూ రిక్వెస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏంటవి?

కల్కి సినిమా రిలీజ్ డేట్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కోవిడ్ ముందు నుంచీ వినిపిస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కల్కి. ఇన్నాళ్లకు ఓ షేప్ తీసుకుని రిలీజ్‌కి జబర్దస్త్ గా రెడీ అయింది. ఇన్ని వాయిదాలు చూశాక... ఇక ఆగలేం అంటున్నారు జనాలు... ప్రమోషన్ల జోరు చూసి మురిసిపోవాలని ఫిక్సయ్యారు. కానీ డైరక్టర్ నాగీ మీద మాత్రం ఓ విషయంలో గట్టిగానే ఒత్తిడి తెస్తున్నారు.

ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మార్కు దాటిన సినిమా బాహుబలి పార్ట్ 2 మాత్రమే. ఆ సినిమా కలెక్షన్లను కల్కి బీట్ చేస్తే చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. బాహుబలి అంత కలెక్ట్ చేస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు కల్కికి ఉన్న హైప్‌తో పోలిస్తే అప్పట్లో బాహుబలికి అంత హైప్ లేదు.

టెక్నికల్‌లో వరల్డ్ స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు కల్కి సినిమాని. బడ్జెట్ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. దాదాపు 600 కోట్లకు పైగా ఖర్చుచేశారు. దీన్ని బట్టి బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే వెయ్యికోట్లను టచ్ చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డులు సృష్టించాలన్నది ఫ్యాన్స్ కోరిక.

ఒకవేళ బిజినెస్‌తో అంత నెంబర్ కనిపించకపోయినా, కలెక్షన్లతో కలిసి నెవర్ బిఫోర్ నెంబర్లను డార్లింగ్ పేరు మీద రికార్డు చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ప్రమోషన్ల పరంగా, ట్రెండింగ్ పరంగా తమ వంతు సాయం చేస్తామని అంటున్నారు. కల్కి రిలీజ్ టెన్షన్ ఓ వైపు, ఫ్యాన్స్ నుంచి అందుతున్న రిక్వెస్టుల స్ట్రెస్ మరో వైపు... ప్రమోషన్ల బిజీ ఇంకో వైపు... అన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు నాగీ.





























