- Telugu News Photo Gallery Cinema photos Actress Anjali Says About Her Role In Gang of Godavari Movie
Actress Anjali: ఆ సినిమా కోసం బూతులు మాట్లాడిన అంజలి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..
దక్షిణాదిలో మంచి టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అంజలి. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ తెలుగమ్మాయి. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించి అలరించింది. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Updated on: May 25, 2024 | 2:00 PM

దక్షిణాదిలో మంచి టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అంజలి. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ తెలుగమ్మాయి. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించి అలరించింది.

ప్రస్తుతం సెకండ్ హీరోయిన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాతోపాటు విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న అంజలి..ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ సినిమా కోసం మొదటిసారి తాను బూతులు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో రత్నమాల పాత్రలో నటించానని..ఇప్పటివరకు తాను నటించిన అన్ని పాత్రల కంటే ఈ మూవీలో తన రోల్ చాలా భిన్నంగా ఉంటుందని తెలిపింది.

తాను ఒక సినిమాలో బూతులు మాట్లాడం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపింది. ఇదే విషయాన్ని తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పే సమయం కూడా తమ టీంకు చెప్పినట్లు తెలిపింది అంజలి. అలాగే బయట కూడా తన వ్యక్తిత్వం అలాంటిది కాదని.. ఎక్కువగా బూతులు అసలు మాట్లాడనని తెలిపింది.

అలాంటిది రత్నమాల పాత్ర కోసం డైరెక్టర్ తనను సంప్రదించడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందంటూ చెప్పుకొచ్చింది. అంజలి ఇప్పటికే ప్రూవ్డ్ యాక్టర్ అని.. ఎలాంటి పాత్రనైనా చేయగలదని.. అందుకే తమ సినిమాకు ఎంపిక చేసుకున్నట్లు డైరెక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు.




