- Telugu News Photo Gallery Cinema photos Ram Gopal Varma meets Vijay Sethupathi, fans wonder if they are making a movie together
వర్మతో సినిమాకు సేతుపతి సై అన్నారా?? ఆశ్చర్యంలో అభిమానులు !!
కొన్ని కాంబినేషన్లను అసలు ఎవరూ ఊహించం. అలాంటిది వాళ్లు కలిసి కనిపిస్తే ఒకింత ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు ఒకే ఫ్రేమ్‌లో విజయ్‌సేతుపతి, రామ్ గోపాల్ వర్మను చూసిన వాళ్లు ఇలాంటి ఆశ్చర్యంలోనే ఉన్నారు. అసలేం జరుగుతోంది వర్మగారూ అని ఆరా తీస్తున్నారు. నెగటివ్ రోల్స్ చేయను. కొంతకాలం ఫుల్‌స్టాప్ పెడుతున్నాను. ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్స్ అయితేనే చేస్తాను అని క్లియర్ కట్‌గా చెప్పేశారు విజయ్ సేతుపతి.
Updated on: May 25, 2024 | 1:59 PM

కొన్ని కాంబినేషన్లను అసలు ఎవరూ ఊహించం. అలాంటిది వాళ్లు కలిసి కనిపిస్తే ఒకింత ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు ఒకే ఫ్రేమ్‌లో విజయ్‌సేతుపతి, రామ్ గోపాల్ వర్మను చూసిన వాళ్లు ఇలాంటి ఆశ్చర్యంలోనే ఉన్నారు. అసలేం జరుగుతోంది వర్మగారూ అని ఆరా తీస్తున్నారు.

నెగటివ్ రోల్స్ చేయను. కొంతకాలం ఫుల్‌స్టాప్ పెడుతున్నాను. ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్స్ అయితేనే చేస్తాను అని క్లియర్ కట్‌గా చెప్పేశారు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఆయన వింటున్న లైన్లన్నీ మెయిన్ లీడ్ కోసం వింటున్నవే.

సరిగ్గా ఇలాంటి సిట్చువేషన్‌లోనే రామ్‌గోపాల్ వర్మని కలిశారు మక్కల్ సెల్వన్. రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు విజయ్ సేతుపతితో మూవీ ప్లాన్ చేస్తున్నారా? గ్యాంగ్‌స్టర్ తరహా రోల్స్ ని చాలా బాగా డిజైన్ చేస్తారనే పేరు ఎప్పటి నుంచో ఉంది వర్మకి.

రీసెంట్‌గా పొలిటికల్ మూడ్‌లో ఉన్న వర్మ ఇప్పుడు దాన్నుంచి బయటపడ్డట్టే కనిపిస్తోంది. సో, ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీని ప్లాన్ చేస్తున్నారా? ఫక్తు కమర్షియల్ అంశాలతో పూర్వ వైభవం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అనే డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి.

చాలా సార్లు స్క్రీన్ మీద చూశాను. ఇప్పుడు నేరుగా చూశాను. స్క్రీన్ మీద చూడటం కన్నా బాగా కనిపిస్తున్నారంటూ మిస్టర్ సేతుపతికి కాంప్లిమెంట్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. మాంచి యాక్షన్ ఓరియంటెడ్ మూవీతో వీరిద్దరూ కొలాబరేట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.




