AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanchipuram: నడిరోడ్డుపై పచ్చిబూతులు తిట్టుకుంటూ.. కాంచీపురం పేరుమాళ్ ఆలయంలో అర్చకుల ముష్టియుద్ధం

వేదమంత్రాలు చదవాల్సిన పూజారులు బండ బూతులు తిట్టుకున్నారు. మాటల్లో చెప్పలేని బూతులు.. చెవులతో వినలేని తిట్లదండకాన్ని అందుకున్నారు. తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల ముష్టి యుద్ధానికి దిగారు. అక్కడితో ఆగకుండా గుడి నుంచి బయటికొచ్చి నడిరోడ్డుపై బూతులు తిట్టుకుంటూ..కొట్టుకునేంత పనిచేశారు.

Kanchipuram: నడిరోడ్డుపై పచ్చిబూతులు తిట్టుకుంటూ.. కాంచీపురం పేరుమాళ్ ఆలయంలో అర్చకుల ముష్టియుద్ధం
Kanchipuram Priest Fight
Balaraju Goud
|

Updated on: May 25, 2024 | 1:22 PM

Share

వేదమంత్రాలు చదవాల్సిన పూజారులు బండ బూతులు తిట్టుకున్నారు. మాటల్లో చెప్పలేని బూతులు.. చెవులతో వినలేని తిట్లదండకాన్ని అందుకున్నారు. తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల ముష్టి యుద్ధానికి దిగారు. అక్కడితో ఆగకుండా గుడి నుంచి బయటికొచ్చి నడిరోడ్డుపై బూతులు తిట్టుకుంటూ..కొట్టుకునేంత పనిచేశారు.

నడిరోడ్డుపై అర్చకుల ముష్టి యుద్ధాన్ని చూసి జనాలు, భక్తులు అవాక్కయ్యారు. వీళ్లు అర్చకులా లేక వీధిరౌడీలా అంటూ ముక్కున వేలేసుకున్నారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు… ఎంత వారించినా తగ్గేదేలే అన్నారు. ఖాకీలను కూడా పట్టించుకోకుండా ఒకరినొకరు దూషించుకున్నారు. ఆ ఫైటింగ్ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఆలయాల నగరంగా పేరొందిన కంచిలోని 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటైన కాంచీపురం దేవరాజ పెరుమాళ్ తిరుకోయిల్ వైకాసి ప్రమోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గంగైకొండ మండపంలో మండగపడి కందరులి భక్తులకు వరదరుని సమర్పించినప్పుడు దత్తాచారి కుటుంబీకులు మంత్ర పుష్పం అనే వేద మంత్రాలను ఆలపిస్తున్నారు. అదే సమయంలో దక్షిణ కళై వర్గం వారు కూడా పాడుతారంటూ వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసుల జోక్యంతో గొడవ సర్దుమణిగింది.

కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో తెంకలై, వడకలై అర్చకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. స్వామివారి కైంకర్యాల విషయంలో ఇరువర్గాలు పోటీ పడుతున్నాయి. ఎవరికి వారు తమకే ముందు ప్రాధాన్యత దక్కాలని కొన్నేళ్లుగా గొడవపడుతూనే ఉన్నారు. దశాబ్ధం గడుస్తున్నా తెంకలై, వడకలై అర్చకుల పంచాయతీ కొలిక్కి రాలేదు. తెంకలై, వడకలై వర్గాల మధ్య గొడవ ఇదేం కొత్త కాదు. ప్రతిసంవత్సరం ఏదో ఒక ఉత్సవంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు అర్చకులు గొడవపడ్డా..సమస్యను పరిష్కరించలేకపోతోంది దేవాదాయశాఖ. తక్షణమే ఈ సమస్యని పరీక్షించాలని కాంచీపురం ప్రజల, భక్తులు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…