AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha 6th Phase Polling: తొలి గంటలో ఓటేసిన ప్రముఖులు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జైశంకర్‌, గాంధీ ఫ్యామిలీ

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం (మే25) పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Lok Sabha 6th Phase Polling: తొలి గంటలో ఓటేసిన ప్రముఖులు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జైశంకర్‌, గాంధీ ఫ్యామిలీ
Lok Sabha Election Poliing
Balaraju Goud
|

Updated on: May 25, 2024 | 1:00 PM

Share

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం (మే25) పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే తొలి గంటల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ బాధ్యతను నెరవేర్చాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తన ఓటు వేశారు. రాష్ట్రపతి భవన్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ బూత్‌కు వెళ్లి ఓటు వేశారు. రాష్ట్రపతి అయిన తర్వాత ద్రౌపదీ ముర్ము తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారు. ఇక ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తొలి గంటల్లో ఓటేశారు. అలాగే, పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఉదయం 7 గంటలకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన తొలి వ్యక్తి ఈయనే కావడంతో అధికారులు ఆయనకు సర్టిఫికేట్‌ కూడా ఇచ్చారు. ఆ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

ఒక గాంధీ కుటుంబం శనివారం ఢిల్లీలో ఓటు వేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు న్యూఢిల్లీ స్థానంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ కూడా తల్లి సోనియా గాంధీతో సెల్ఫీ దిగి పంచుకున్నారు. ప్రియాంక కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సోనియా, రాహుల్, ప్రియాంక ఓటు వేసిన స్థానం నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరూ లేరు. ఆప్‌తో పొత్తు కారణంగా ఈసారి న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సోమనాథ్ భారతి బరిలో ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బన్సూరి స్వరాజ్ బరిలో ఉన్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో ఓటు వేశారు.

ఇక, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు. తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్‌, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌ కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ కుటుంబసభ్యులు, ఢిల్లీ మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ, మాజీ ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర తదితరులు తొలి గంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఆరో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దేశరాజధానిలో మొత్తం 7 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. INDI అలయెన్స్‌లో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాయి. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు నుంచి గట్టి ఎదురవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..