MBBS Seats: మెడిసిన్‌ చదవాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. పెరగనున్న సీట్లు..

ఈ నేపథ్యంలో వచ్చే అకడమిక్‌ ఇయర్‌కు గాను వైద్య కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టడానికి అనుగుణంగా తనిఖీల ప్రక్రియ సాగుతోంది. పాత మెడికల్ కాలేజీల్లో జాతీయ వైద్య కమిషన్‌ ఇప్పటికే తనిఖీలు పూర్తి చేయగా.. ఈ నెలాఖరులో కొత్త వైద్య కళాశాలల్లో నేరుగా తనిఖీలు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ తనిఖీల అనంతరం 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా వైద్య కళాశాలల్లో...

MBBS Seats: మెడిసిన్‌ చదవాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. పెరగనున్న సీట్లు..
Mbbs Seats
Follow us

|

Updated on: May 25, 2024 | 3:30 PM

మెడిసిన్‌లో సీటు సాధించడం ఎంత కష్టమైన విషయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరీక్ష రాసేవారు లక్షల్లో ఉంటే అందుబాటులో ఉండే సీట్లు మాత్రం వేలల్లో ఉండడమే దీనికి కారణం. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాట్లు పెరగడంతో తెలంగాణలో మెడిసిన్‌ సీట్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చే అకడమిక్‌ ఇయర్‌కు మరిన్ని ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో వచ్చే అకడమిక్‌ ఇయర్‌కు గాను వైద్య కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టడానికి అనుగుణంగా తనిఖీల ప్రక్రియ సాగుతోంది. పాత మెడికల్ కాలేజీల్లో జాతీయ వైద్య కమిషన్‌ ఇప్పటికే తనిఖీలు పూర్తి చేయగా.. ఈ నెలాఖరులో కొత్త వైద్య కళాశాలల్లో నేరుగా తనిఖీలు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ తనిఖీల అనంతరం 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా వైద్య కళాశాలల్లో అడ్మిషన్లకు పూర్తిస్థాయి అనుమతులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్‌ రెండోవారంలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుందని వైద్య విద్య డైరెక్టరేట్‌ (డీఎంఈ) వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే వైద్య విద్యనభ్యసించాలని ఆశపడుతున్న వారికి అధికారులు శుభవార్త తెలిపారు. కొత్త కాలేజీలతోపాటు ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు అదనంగా సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ములుగు, గద్వాల, నారాయణపేట, నర్సంపేట, మెదక్, భువనగిరి, కుత్బుల్లాపూర్, మహేశ్వరంలలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎన్‌ఎంసీ ప్రాథమిక అనుమతిచ్చింది. వీటిల్లో తరగతుల ప్రారంభానికి వీలుగా పలుచోట్ల కొత్త భవనాల నిర్మాణం కొనసాగుతోంది. వీటికి అనుబంధ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి సీట్లు పెరిగే అవకాశం ఉంది.

కాగా తెలంగాణ వ్యాప్తంగా గత విద్యా సంవత్సరం వరకు 56 వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 8,440 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. అయితే తాజాగా వీటికి ఎనిమిది ప్రభుత్వ, రెండు ప్రైవేటు వైద్య కళాశాలలకు పూర్తి స్థాయిలో అనుమతులు లభిస్తే మరో 500 సీట్లు అదనంగా రానున్నాయి. అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం కన్వీర్‌ కోటా సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి. ఈ లెక్కన జాతీయ కోటా పోగా మిగిలిన సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభించనున్నాయి. ఇప్పటి వరకు కన్వీనర్ కోటా సీట్లలో 15 శాతం సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..