AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career Growth: కెరీర్‌లో సక్సెస్‌ కావాలా.? అమెజాన్‌ సీఈఓ చెప్పిన సీక్రెట్ ఇదే..

కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే కచ్చితంగా సానుకూల దృక్పథంతో ఉండాలని చెబుతున్నారు. తాజాగా లింక్డిన్‌ సీఈవో ర్యాన్ రోస్లాన్‌స్కీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పాజిటివ్‌ యాటిట్యూడ్‌ అనేది కేవలం ఉల్లాసంగా ఉండడానికే పరిమితం కాదని.. నమ్మకమైన సహచరుడిగా ఉండడం, గడువులోగా లక్ష్యాల్ని చేరుకోవడం...

Career Growth: కెరీర్‌లో సక్సెస్‌ కావాలా.? అమెజాన్‌ సీఈఓ చెప్పిన సీక్రెట్ ఇదే..
Career Growth
Narender Vaitla
|

Updated on: May 25, 2024 | 1:27 PM

Share

ప్రతీ ఒక్కరికీ కెరీర్‌లో సక్సెస్‌ కావాలనే ఆశ ఉంటుంది. అందుకోసం అనుక్షణం కృషి చేస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తుంటారు. అందుకోసం కష్టపడి పని చేస్తుంటారు. అయితే కెరీర్‌లో రాణించాలంటే కష్టపడేతత్వం, వేగంగా నేర్చుకోవడం ఎంత ముఖ్యమో పాజిటివ్‌ యాటిట్యూడ్‌ కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. ఈ మాట చెప్పింది మరెవరో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఈకామర్స్‌ సంస్థ అయిన అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ.

కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే కచ్చితంగా సానుకూల దృక్పథంతో ఉండాలని చెబుతున్నారు. తాజాగా లింక్డిన్‌ సీఈవో ర్యాన్ రోస్లాన్‌స్కీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పాజిటివ్‌ యాటిట్యూడ్‌ అనేది కేవలం ఉల్లాసంగా ఉండడానికే పరిమితం కాదని.. నమ్మకమైన సహచరుడిగా ఉండడం, గడువులోగా లక్ష్యాల్ని చేరుకోవడం, సాధించగలననే స్ఫూర్తి వంటి లక్షణాలన్నీ అందులో భాగమని చెప్పుకొచ్చారు. ఇక కెరీర్‌లో సక్సెస్‌ కావాలంటే ప్రతీ ఒక్క ఉద్యోగి తనకు తాను కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని ఆండీ జస్సీ అభిప్రాయపడ్డారు.

కష్టపడి పని చేస్తున్నానా.? లేదా.? పదే పదే ఫిర్యాదు చేయడం కాకుండా ఆశావహ దృక్పథంతో ముందుకెళ్తున్నానా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానా? సమర్థంగా, సమన్వయంతో ముందుకెళ్లగలనా? అన్న ప్రశ్నలకు ప్రతీ ఒక్కరి దగ్గర సమాధానం ఉండాలని జస్సీ సూచించారు. ఇలాంటి విషయాలను చాలా మంది విస్మరిస్తున్నారని ఆయ తెలిపారు. పాజిటివ్‌ అటిట్యూడ్‌ పెంచుకోవడం వల్ల కొత్త సవాళ్లను స్వీకరించే సామర్థ్యం పెరుగుతుంది. వీటివల్ల వచ్చే ఫలితాలు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి అని చెప్పుకొచ్చారు.

సానుకూల దృక్పథంతో ఉండేవారికి మంచి సంబంధాలు ఏర్పడుతాయని, అలాంటి వారికి అందరూ ఆకర్షితులవుతారని తెలిపారు. వాళ్లు సక్సెస్‌ కావాలని కోరుకుంటారు. ఫలితంగా కెరీర్‌లో విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయని జస్సీ చెప్పుకొచ్చారు. కెరీర్‌లో ఉన్న స్థాయికి చేరుకోవాలన్నా, ఇతరులతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉండడానికి స్కిల్స్ ఎంత ముఖ్యమో పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ కూడా అంతే ముఖ్యమని జస్సీ చెప్పుకొచ్చారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..