JEE Advanced 2024: నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. ఆఖరి నిమిషంలో ఈ పొరబాట్లు చేయకండి!

దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష ఈ రోజు (మే 26) ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఆదివారం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 26, తెలంగాణలో 13 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. ఒక్కొక్క పేపర్‌ రాసేందుకు 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పేపర్‌ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల మధ్య నిర్వహిస్తారు..

JEE Advanced 2024: నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. ఆఖరి నిమిషంలో ఈ పొరబాట్లు చేయకండి!
JEE Advanced
Follow us

|

Updated on: May 26, 2024 | 6:41 AM

న్యూఢిల్లీ, మే 26: దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష ఈ రోజు (మే 26) ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఆదివారం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 26, తెలంగాణలో 13 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. ఒక్కొక్క పేపర్‌ రాసేందుకు 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పేపర్‌ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల మధ్య నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు దాదాపు 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్ధులు అడ్వాన్స్‌డ్ రాయనున్నారు. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ర్యాంకు పొందిన వారిని మాత్రమే ఈ పరీక్షకు అనుమతిస్తారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తీర్ణులైతే ఐఐటీల్లో బీటెక్‌ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు పరీక్ష రాసేందుకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు..

  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకన్నఅడ్మిట్ కార్డును తమతోపాటు ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. అలాగే ఒక ఒరిజినల్ ఫొటో కూడా తీసుకెళ్లాలి.
  • ఆధార్ కార్డ్, పాఠశాల/ కాలేజీ లేదా ఏదైనా విద్యా సంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, పాస్‌పోర్టు, పాన్ కార్డు తదితరాల్లో ఏదైనా ఒకటి కచ్చితంగా తమతోపాటు తీసుకెళ్లాలి.
  • పెన్నులు, పెన్సిళ్లు, తాగునీటి బాటిల్స్‌ లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
  • పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే అభ్యర్ధులు ధరించాలి.
  • దుస్తులపై బంగారు లేదా ఇతర మెటల్‌ ఆభరణాలు, నగలు ఉంటే అటువంటి వారిని లోనికి అనుమతించరు.
  • స్కార్ఫ్‌లు, మఫ్లర్‌లు, స్టోల్స్, షాల్స్, టోపీలు, రంగుల కళ్ళద్దాలు వంటివి ధరించరాదు.
  • బూట్లు, మందమున్న చెప్పులు వేసుకున్న వారిని కూడా అనుమతించరు.
  • ఎలాంటి లోహాలతో కూడిన వస్తువులనైనా ఒంటిపై ధరించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లరాదు.
  • ఉంగరాలు, గాజులు, మెట్టెలు, మెడలో చైన్లు వేసుకున్న వారిని కూడా అనుమతించారు.
  • మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!