TG SSC Supply Exam 2024 Hall Tickets: తెలంగాణ ‘పది’ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల.. జూన్‌ 3 నుంచి పరీక్షలు

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ పాఠశాల నుంచి హాల్‌ టికెట్లు పొందవచ్చు. కాగా రాష్ట్రంలో జూన్‌ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు..

TG SSC Supply Exam 2024 Hall Tickets: తెలంగాణ ‘పది’ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల.. జూన్‌ 3 నుంచి పరీక్షలు
TG SSC Supply Exams
Follow us

|

Updated on: May 26, 2024 | 7:42 AM

హైదరాబాద్‌, మే 26: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ పాఠశాల నుంచి హాల్‌ టికెట్లు పొందవచ్చు. కాగా రాష్ట్రంలో జూన్‌ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

తెలంగాణ పదో తరగతి 2024 అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌..

  • జూన్‌ 3వ తేదీన తెలుగు, ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌లో కాంపోజిట్‌ కోర్సు-1, కాంపోజిట్‌ కోర్సు-2 పరీక్షలు
  • జూన్‌ 5వ తేదీన సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • జూన్‌ 6వ తేదీన ఇంగ్లిష్‌
  • జూన్‌ 7వ తేదీన గణితం
  • జూన్‌ 8వ తేదీన భౌతికశాస్త్రం
  • జూన్‌ 10వ తేదీన జీవశాస్త్రం
  • జూన్‌ 11వ తేదీన సాంఘికశాస్త్రం
  • జూన్‌ 12వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్‌) పేపర్‌-1
  • జూన్‌ 13వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్‌) పేపర్‌-2 పరీక్షలు

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

జూన్‌ 8న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష.. మే 30న హాల్‌టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్‌ ట్రైనింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్‌ 8న ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2024 నిర్వహించేందుకు ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు మే 30న విడుదల కానున్నాయి. పరీక్ష అనంతరం జూన్‌ 15న ప్రిలిమినరీ కీ విడుదల చేశాక, జూన్‌ 18 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.