Bangladesh MP: బంగ్లా ఎంపీ మర్డర్‌ కేసులో ట్విస్ట్! వలపు వల విసిరి.. చర్మం ఒలిచి..

బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ (56) కోల్‌కతాలో మే 13న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంలో అగంతకులు ఎంపీని దారుణంగా హత్య చేసి, డెడ్‌ బాడీని మాయం చేశారు. ఈ కేసులో జిహాద్‌ హవ్లాదార్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో దర్యాప్తులో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు..

Bangladesh MP: బంగ్లా ఎంపీ మర్డర్‌ కేసులో ట్విస్ట్! వలపు వల విసిరి.. చర్మం ఒలిచి..
Bangladesh MP Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: May 24, 2024 | 12:21 PM

కోల్‌కతా, మే 24: బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ (56) కోల్‌కతాలో మే 13న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంలో అగంతకులు ఎంపీని దారుణంగా హత్య చేసి, డెడ్‌ బాడీని మాయం చేశారు. ఈ కేసులో జిహాద్‌ హవ్లాదార్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో దర్యాప్తులో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

ఎంపీ హత్యకు సినిమాటిక్‌గా ప్లాన్‌.. పాత స్నేహితుడే సూత్రదారి

బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా అక్రమంగా వచ్చిన జిహాద్‌ హవ్లాదార్‌ నకిలీ పత్రాలతో పలు సిమ్‌లు కొనుగోలు చేశాడు. ముంబైలోని చినార్ పార్క్ ప్రాంతంలో అద్దె ఇంట్లో దిగాడు. అందుకు షాహీన్ అనే యువతి ఏర్పాట్లు చేసింది. ఎంపీని హత్య చేసేందుకు షాహీన్‌ రెండున్నర కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. విచారణలో పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో జిహాద్‌ నేరాన్ని అంగీకరించాడు. చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన ఎంపీ అన్వరుల్ అజిమ్‌ అనార్‌ను పక్కాప్లాన్‌ ప్రకారం ఎంపీని హత్య చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కు చెందిన అమెరికా పౌరుడు అక్తరుజ్జమాన్‌ ప్రధాన సూత్రదారి అని జిహాద్‌ తెలిపాడు. అతడు ఎంపీకి పాత స్నేహితుడు. అక్తరుజ్జమాన్‌ ఆదేశాల మేరకు జిహాద్‌ మరో ఇద్దరితో కలిసి న్యూటౌన్‌ అపార్ట్మెంట్‌లో ఎంపీని దారుణంగా హత్య చేశారు.

చర్మం ఒలిచి.. ఎముకలు తొలగించి..

ఎంపీ అన్వరుల్‌ను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం మాంసం, ఎముకలు, చర్మాన్ని వేరుచేసి శరీరాన్ని ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఫ్లాట్‌లోనే ఉన్న ఫిజ్‌లో భద్రపరిచారు. కుళ్లిపోయి దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ వినియోగించారు. అనంతరం వేర్వేరు ట్రాలీల్లో బయటకు తీసుకెళ్లారు. ఇతరులకు అనుమానం రాకుండా ఉండేందుకు మాంసానికి వంట మసాలాలు, పసుపు కూడా కలిపారు. అయితే ముక్కలు చేసిన భాగాలను ఎక్కడెక్కడ వేశారనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. మరో ట్విస్ట్‌ ఏంటంటే.. హత్య చేసిన రాత్రి హంతకులు ఫ్లాట్‌లో మాంసం వండుకుని తిన్నారు. అయితే అది ఎంపీ మాంసం కాదు. రెండు దశల్లో శరీర భాగాలను తొలగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహం భాగాలను తరలించేందుకు తెల్లటి రంగు కారును ఉపయోగించారు. ఆన్‌లైన్ యాప్‌ ద్వారా కారును ఏప్రిల్ 30న అద్దెకు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

రూ.5 కోట్లు సుపారీ.. దొరకని ఎంపీ శరీర అవశేషాలు

బుధవారం బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ మాట్లాడుతూ.. అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు. బెంగాల్ సిఐడి న్యూ టౌన్ అపార్ట్‌మెంట్ లోపల రక్తపు మరకలను గుర్తించింది. శరీర భాగాలను డంప్ చేయడానికి ఉపయోగించిన అనేక ప్లాస్టిక్ సంచులను కూడా స్వాధీనం చేసుకుంది. ఎంపీని తొలుత గొంతు కోసి చంపి, ఆపై అతని శరీరాన్ని అనేక ముక్కలుగా నరికివేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తించకుండా చర్మాన్ని ఒలిచి, శరీర భాగాలను ఛిద్రం చేశారు. అనంతరం అవశేషాలను ప్లాస్టిక్‌ సంచుల్లో ప్యాక్‌ చేశారు. వీటిని కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో విసిరేసినట్లు తెలిపారు. ఎంపీని చంపేందుకు నిందితులు 5 కోట్ల రూపాయలు సుపారీ తీసుకున్నట్లు తేలింది. హంతకులకు అడ్వాన్స్ గా రూ.2.5 కోట్లు కూడా చెల్లించారు.

హత్య మాస్టర్ ప్లాన్‌లో పాల్గొన్న యువతి షాహీన్‌ది కీలక పాత్ర. ఆమె అఖ్తరుజ్జమాన్ గర్ల్ ఫ్రెండ్. ఎంపీ అన్వరుల్‌కు వలపు వల విసిరి ఆమెను కలిసేందుకు అపార్ట్‌మెంట్‌కు రప్పించి హత్య చేశారానే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎంపీ హత్యకేసులో సియామ్ హొస్సేన్, ముస్తాఫిజుర్ ఇంకా పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో పట్టుబడిన జిహాద్‌ను విచారించేందుకు బంగ్లాదేశ్ పోలీసులు కోల్‌కతా వచ్చే అవకాశం ఉంది. పోలీసుల విచారణలో జిహాద్ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తేలింది. మృతదేహాన్ని ఎక్కడ పడేసిందనే విషయంపై గురువారం అంతా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడా ఎంపీ శరీర భాగాలు దొరకలేదు. లభ్యమైన శరీర భాగాలు సరిపోలడం లేదని పరిశోధకులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.