AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hampi Tour: హంపి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ఆగండాగండి.. ఈ నెలల్లో వెళ్తే దిల్‌ ఖుష్‌..!

దక్షిణ భారత్‌లోని ప్రముఖ టూరిస్ట్‌ ప్రదేశాల్లో హంపి ముఖ్యమైనది. కర్ణాటకలో ఉన్న హంపి దేశ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతిరూపం. విజయనగర సామ్యాజ్య వైభవాన్ని చాటిచెప్పే సాంస్కృతిక సంపదకు హంపి పెట్టింది పేరు. ఇక్కడ ఉండే శతాబ్దాల నాటి శిల్పాలు, అద్భుతమైన కట్టడాలు, అద్భుత ప్రకృతి దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తూ ఉంటాయి. మీరూ హంపి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారా?..

Hampi Tour: హంపి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ఆగండాగండి.. ఈ నెలల్లో వెళ్తే దిల్‌ ఖుష్‌..!
Hampi Travel Guide
Srilakshmi C
|

Updated on: May 23, 2024 | 12:27 PM

Share

దక్షిణ భారత్‌లోని ప్రముఖ టూరిస్ట్‌ ప్రదేశాల్లో హంపి ముఖ్యమైనది. కర్ణాటకలో ఉన్న హంపి దేశ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతిరూపం. విజయనగర సామ్యాజ్య వైభవాన్ని చాటిచెప్పే సాంస్కృతిక సంపదకు హంపి పెట్టింది పేరు. ఇక్కడ ఉండే శతాబ్దాల నాటి శిల్పాలు, అద్భుతమైన కట్టడాలు, అద్భుత ప్రకృతి దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తూ ఉంటాయి. మీరూ హంపి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారా? అధిక వేడి, వాన, చలి వంటి వాతావరణ పరిస్థితుల వల్ల మీ ట్రిప్‌కు ఆటంకం రాకుండా ఉండాలంటే.. ఏయే నెలల్లో ఏయే సమయాల్లో వెళ్లేందుకు ఎలా ప్లాన్‌ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి, దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాల మాదిరిగానే, హంపి కూడా వేసవిలో వెచ్చగా, శీతాకాలంలో అతి చల్లగా ఉంటుంది. మార్చి నుండి జూన్ వరకు ఉండే వేసవిలో దాదాపు అన్ని రోజుల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడి విపరీతమైన వేడి కారణంగా బయటకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సూర్యకిరణాలు బలంగా ఉన్నప్పుడు బయటికి వెళ్లలేం. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాలంలో ఇక్కడ భారీ వర్షపాతం నమోదవుతుంది. నిరంతర వానల బయటకు వెళ్లడం అస్సలు సాధ్యం కాదు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో హంపిని సందర్శించడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ నెలల్లో అక్కడి ఉష్ణోగ్రతలు 15 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటుంది. ఈ రకమైన వాతావరణం వల్ల త్వరగా అలసిపోకుండా అన్ని ప్రదేశాలు చూసేందుకు అవకాశం ఉంటుంది.

ఈ నెలల్లో వెళ్తే పర్యాటకం ఆనందమయం

అక్టోబర్ – నవంబర్.. ఈ రెండు నెలలు ఈ ప్రాంతంలో చలికాలం ప్రారంభం అవుతుంది. తేలికపాటి వానలతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందువల్ల పర్యాటకులకు ఈ నెలల్లో హంపీని ఎక్కువగా సందర్శిస్తుంటారు. అలాగే డిసెంబర్ – ఫిబ్రవరి వరకు కూడా పర్యాటకులు హంపికి పోటెత్తుతారు. ఈ నెలల్లో మంచి వాతావరణ పరిస్థితులు మాత్రమేకాకుండా ఈ నెలల్లో స్థానికులు జరుపునే పండగలను కూడా వీక్షించవచ్చు. ఇది ప్రతి నవంబర్‌లో జరిగే వార్షిక హంపి ఉత్సవ్‌లో సంప్రదాయ సంగీతం, నృత్యం వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ప్రదర్శనలన్నీ ఇక్కడ కనిపించే కొన్ని ఐకానిక్ స్మారక చిహ్నాల నేపథ్యానికి అనుగుణంగా జరుగుతాయి. తద్వారా వాటిని దృశ్యపరంగా మరింత ఆకర్షణీయంగా వీక్షించవచ్చు.

ఇవి కూడా చదవండి

విరూపాక్ష కార్ ఫెస్టివల్

ఈ పండుగను ఫిబ్రవరి లేదా మార్చిలో జరుపుకుంటారు. విరూపాక్ష కార్ ఫెస్టివల్ హంపి టౌన్ కౌన్సిల్ పరిధిలోకి వచ్చే విరుపాపూర్ గద్దె ప్రాంతంలోని ఆలయంలో జరుపుతారు. ఈ పండుగకు ఆలయంలోని విరూపాక్ష భగవానుని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధించడం జరుగుతుంది. విరూపాక్ష విగ్రహాన్ని చక్కగా అలంకరించి.. రథంలో వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు పాటలు పాడుతూ సాంప్రదాయ వాయిద్యాలు వాయిస్తారు.

హంపి ట్రిప్ ఇలా ప్లాన్ చేయండి..

ఈ నెలల్లో హంపి పర్యాటక ప్రాంతం రద్దీగా ఉంటుంది. అందువల్ల పీక్ సీజన్‌లో హోటళ్లలో ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. తద్వారా ట్రిప్‌ సమయంలో ఇష్టమైన హోటల్‌లో హాయిగా గడపవచ్చు. వాతావరణానికి అనుగుణమైన తేలికపాటి దుస్తులు, ఎక్కువ దూరం నడవడానికి, సూర్యుని నుండి రక్షణకు అనువైన సౌకర్యవంతంగా ఉండే బూట్లు ధరించాలి. సన్‌స్క్రీన్ ధరించడం చాలా అవసరం. హంపీ నగరంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డీహైడ్రేట్‌ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రోజంతా తగినంత నీరు తాగాలి. హంపి.. ఓ పురావస్తు ప్రదేశం మాత్రమేకాదు. హంపి చుట్టూ ఉన్న అనేక దేవాలయాలు, ఇతర మతపరమైన స్మారక చిహ్నాలను స్థానికులు పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ఈ ప్రదేశాలను సందర్శించేటప్పుడు నిరాడంబరమై దుస్తులు ధరించాలి. స్థానిక ప్రజల ఆచారాలను గౌరవించాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.