Katrina Kaif Pregnancy: బేబీ బంప్‌తో కత్రినా కైఫ్‌.. లండన్‌లో డెలివరీ? సోషల్‌ మీడియాలో నెటిజన్ల హంగామా

ప్రముఖ స్టార్‌నటి కత్రినా కైఫ్‌ తెలియని వారుండరు. టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో పలు హిట్‌ మువీల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2021లో విక్కీ కౌషల్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది. అయితే వీరి వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత కత్రినా ప్రెగ్నెంట్‌ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

Katrina Kaif Pregnancy: బేబీ బంప్‌తో కత్రినా కైఫ్‌.. లండన్‌లో డెలివరీ? సోషల్‌ మీడియాలో నెటిజన్ల హంగామా
Katrina Kaif Pregnency
Follow us

|

Updated on: May 22, 2024 | 10:45 AM

ప్రముఖ స్టార్‌నటి కత్రినా కైఫ్‌ తెలియని వారుండరు. టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో పలు హిట్‌ మువీల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2021లో విక్కీ కౌషల్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది. అయితే వీరి వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత కత్రినా ప్రెగ్నెంట్‌ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఇప్పటి వరకూ కత్రినా- విక్కీ జంట అధికారికంగా ధృవీకరించలేదు. కానీ నటి, ఆమె భర్త కలిసి లండన్‌ వీధుల్లో తిరుగుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో కత్రినాను చూసిన నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ ప్రచారం చేయసాగారు. కత్రినా- విక్కీ తమ మొదటి బిడ్డకు లండన్‌లో జన్మనివ్వబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ బ్యూటీ ప్రెగ్నెంట్‌ అనీ, లండన్‌లో డెలివరీ ప్లాన్‌ చేసుకున్నట్లు, ఇప్పటికే విక్కీ కూడా అక్కడికి చేరుకున్నట్లు సోషల్‌ మీడియా కోడై కూస్తుంది.

కాగా సరిగ్గా ఓట్ల పండక్కి ఈ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో వీక్కీ-కత్రినా లండన్‌ని ఓ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. అయితే కత్రినా వేసుకున్న కోటు వల్లనో లేదంటే నిజంగానే ఆమె పొట్ట ఎత్తుగా ఉందో తెలియదుగానీ చూసేందుకు బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపించింది. అంతే.. ఆమె ప్రెగ్నెంట్‌ అని నెటిజన్లు కన్ఫామ్ చేసేశారు. పైగా మీడియా కంట పడకూడని అలా కోటు వేసుకుందని, అందుకే దేశం విడిచి లండన్‌కు చేరుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా కత్రినా ప్రెగ్నెంట్‌ రూమర్స్‌ నెట్టింట చక్కర్లు కొట్టడం ఇదేం తొలిసారి కాదు. గతంలో అనంత్‌ అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌ టైంలో కూడా ఇదే విధంగా పుకార్లు షికార్లు చేశాయి.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

కాగా రూమర్స్‌ సంగతి అటుంచితే ప్రస్తుతం కత్రినా కైఫ్, తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి లండన్‌లో ఉంటున్నారు. అక్కడే ఇటీవల భర్త విక్కీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కూడా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈ జంట ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశారు కూడా. ఇక సినిమాల విషయానికొస్తే ఆనంద్ తివారీ సంగీతం అందిస్తోన్న ‘బాడ్ న్యూజ్‌’ అనే మువీలో త్వరలో విక్కీ కౌశల్‌ నటించనున్నారు. ఈ చిత్రంలో ట్రిప్తి డిమ్రీ, అమీ విర్క్, ఫాతిమా సనా షేక్, నేహా ధూపియా కీలక పాత్రల్లో నటించనున్నారు. దీనితోపాటు ఛావ, లవ్‌ అండ్‌ వార్‌ ప్రాజెక్టులు ప్రస్తుతం విక్కీ చేతిలో ఉన్నాయి. కత్రినా చివరి సారిగా మెరీ క్రిష్టమస్‌ మువీలో విజయ్‌ సేతుపతి సరసన నటించింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles