Career Options After 12th: ఐఐటీ చదవడం మీ డ్రీమా? దేశంలోని బెస్ట్‌ IIT కోర్సులు, టాప్‌ IIT కాలేజీలు ఇవే..

దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కోర్సులకు ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. ఈ క్యాంపస్‌లలో చదివేందుకు యువత ఉర్రూతలూగుతుంటారు. అందుకే ఇంటర్‌లోనే ఎంతో కఠినమైన JEE అడ్వాన్స్‌డ్‌ క్రాక్‌ చేసేందుకు అహర్నిశలు కష్టపడి చదువుతారు. జేఈఈ మెయిన్‌ అర్హత సాధించిన వారికి మాత్రమే అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో జేఈఈలో మెరిసేందుకు చాలా మంది కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ కూడా తీసుకుంతారు..

Career Options After 12th: ఐఐటీ చదవడం మీ డ్రీమా? దేశంలోని బెస్ట్‌ IIT కోర్సులు, టాప్‌ IIT కాలేజీలు ఇవే..
best IIT courses in India
Follow us

|

Updated on: May 21, 2024 | 10:37 AM

దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కోర్సులకు ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. ఈ క్యాంపస్‌లలో చదివేందుకు యువత ఉర్రూతలూగుతుంటారు. అందుకే ఇంటర్‌లోనే ఎంతో కఠినమైన JEE అడ్వాన్స్‌డ్‌ క్రాక్‌ చేసేందుకు అహర్నిశలు కష్టపడి చదువుతారు. జేఈఈ మెయిన్‌ అర్హత సాధించిన వారికి మాత్రమే అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో జేఈఈలో మెరిసేందుకు చాలా మంది కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ కూడా తీసుకుంతారు. మంచి కట్-ఆఫ్ స్కోర్‌తో JEE అడ్వాన్స్‌డ్‌ను క్లియర్ చేసిన విద్యార్థులు నచ్చిన IIT కోర్సులో ప్రవేశం పొందే అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన డేటా ప్రకారం.. దేశంలోని 23 IITలలో ఉన్న ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్‌కు సంబంధించి 130 కోర్సులు అందిస్తున్నాయి. ఈ 130 కోర్సులలో 64 బీటెక్ కోర్సులు, 14 బీఎస్ కోర్సులు, 1 బీఆర్క్ కోర్సులు, 42 బీటెక్ + ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు, ఒక బీటెక్ అండ్‌ ఎంబీఎ డ్యూయల్ డిగ్రీ కోర్సులు, 5 ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు, 5 బీఎస్ అండ్‌ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. IITలు అందించే ఈ 130 కోర్సుల్లో విద్యార్థులు ఏ కోర్సును ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుకే IITలలో డిమాండ్‌ ఉన్న BTech కోర్సుల జాబితాతోపాటు బెస్ట్‌ కాలేజీల వివరాలను కూడా ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.

IITలు అందించే డిమాండ్‌ ఉన్న BTech కోర్సులు ఇవే..

JEE అడ్వాన్స్‌డ్‌లో మంచి కట్-ఆఫ్ స్కోర్‌తో క్లియర్ చేసిన విద్యార్ధులు JoSAA కౌన్సెలింగ్‌లో ఈ కింద పేర్కొన్న కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు.

  • కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ డేటా సైన్స్
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
  • ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
  • మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • కెమికల్ ఇంజనీరింగ్
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ డేటా ఇంజనీరింగ్

అధిక జీతం అందుకోవాలంటే ఈ కింది బెస్ట్‌ ఇంజనీరింగ్ కోర్సులు ఎంచుకోవాలి. అవేంటంటే..

  • రోబోటిక్స్ ఇంజనీరింగ్
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
  • నానోటెక్నాలజీ
  • డేటా సైన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్
  • బయోమెడికల్ ఇంజనీరింగ్
  • ఏరోస్పేస్ ఇంజనీరింగ్
  • నావల్ అండ్‌ ఓషన్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్

12వ తేదీ తర్వాత తీసుకోదగిన బెస్ట్‌ ఐఐటీ కోర్సులు ఇవే..

ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న వారు, 12వ తరగతి (ఇంటర్‌)లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో ఉత్తీర్ణులైన విద్యార్థులు IITలలో ఈ కింది కోర్సులను ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి
  • ఏరోస్పేస్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
  • ఇంజనీరింగ్ ఫిజిక్స్
  • బయోసైన్సెస్ అండ్‌ బయో ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • బయోటెక్నాలజీ అండ్‌ బయోకెమికల్ ఇంజనీరింగ్
  • ఓషన్ ఇంజనీరింగ్ అండ్‌ నావల్ ఆర్కిటెక్చర్
  • కెమికల్ ఇంజనీరింగ్
  • ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (పవర్ అండ్‌ ఆటోమేషన్)
  • కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • డేటా సైన్స్ అండ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
  • అగ్రికల్చర్ అండ్‌ ఫుడ్ ఇంజనీరింగ్
  • డేటా సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్
  • బయో ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • సిరామిక్ ఇంజనీరింగ్

పైన పేర్కొన్న కోర్సులే కాకుండా అనేక ఇతర కోర్సులను IIT అందిస్తోంది. 12వ తరగతి తర్వాత విద్యార్థులు ఎంచుకోదగిన 5 అకడమిక్ ప్రోగ్రామ్‌లు ఏవంటే.. B.Arch, B.Tech, BS, B.Tech-M.Techలో డ్యూయల్ డిగ్రీ, BS-MSలో డ్యూయల్ డిగ్రీ.

ర్యాంక్‌ వైజ్‌ టాప్ IIT కాలేజీలు ఇవే..

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) వారణాసి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
పట్టులాంటి మెరిసే జుట్టు కావాలంటే..ఈ నీటిని పారబోయకుండా వాడేయండి!
పట్టులాంటి మెరిసే జుట్టు కావాలంటే..ఈ నీటిని పారబోయకుండా వాడేయండి!
విదేశాల్లో సూపర్.. భారత్‌లో ఫెయిల్.. 2వ టెస్ట్ నుంచి సిరాజ్ ఔట్
విదేశాల్లో సూపర్.. భారత్‌లో ఫెయిల్.. 2వ టెస్ట్ నుంచి సిరాజ్ ఔట్
ఏపీ టెట్‌ పరీక్షలకు భారీగా తగ్గిన హాజరు.. ఫలితాలు ఎప్పుడంటే!
ఏపీ టెట్‌ పరీక్షలకు భారీగా తగ్గిన హాజరు.. ఫలితాలు ఎప్పుడంటే!
వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దు..! ఏపీ పొలిటీషియన్స్ కు తెలంగాణ
వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దు..! ఏపీ పొలిటీషియన్స్ కు తెలంగాణ
పేదలకు అందుబాటులో ఆకాశయానం.. ఆ పథకం మరో పదేళ్ల పొడగింపు
పేదలకు అందుబాటులో ఆకాశయానం.. ఆ పథకం మరో పదేళ్ల పొడగింపు
తన అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. అన్‌స్టాపబుల్ ప్రోమో వైరల్..
తన అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. అన్‌స్టాపబుల్ ప్రోమో వైరల్..
యూఎస్‌లో అమలు చేయలేకపోయాం.. ఆధార్‌పై నోబెల్ గ్రహీత కీలక వ్యాఖ్యలు
యూఎస్‌లో అమలు చేయలేకపోయాం.. ఆధార్‌పై నోబెల్ గ్రహీత కీలక వ్యాఖ్యలు
25 సిక్సర్లు, 23 ఫోర్లు.. ట్రిపుల్ సెంచరీతో ఊచకోత..
25 సిక్సర్లు, 23 ఫోర్లు.. ట్రిపుల్ సెంచరీతో ఊచకోత..