Telangana: రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీల నియామకం.. ఫుల్ లిస్ట్ ఇదే..
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం ప్రకటించింది.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. కొత్త వీసీలు నియమితులయ్యేంత వరకూ వీరే బాధ్యతల్లో కొనసాగనున్నారు.
యూనివర్సిటీల ఇన్‌ఛార్జ్ వీసీల జాబితా ఇదే..
- ఉస్మానియా వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా దాన కిషోర్
- జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్ వీసీగా బుర్ర వెంకటేశం
- తెలుగువర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా శైలజారామయ్యర్
- అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా రిజ్వి
- కాకతీయ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా వాకాటి కరుణ
- తెలంగాణవర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా సందీప్ సుల్తానియా
- మహాత్మాగాంధీ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా నవీన్‌మిట్టల్
- శాతవాహన వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా సురేంద్రమోహన్
- JNUFA వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా జయేష్ రంజన్
- పాలమూరు వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా నదీమ్ అహ్మద్
10 యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో ప్రభుత్వంలో వివిధ శాఖాధిపతులుగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే కొత్త వీసీల కోసం అన్ని వర్శిటీలలో సెర్చ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. జాబితాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోనుంది. అప్పటివరకు ఇన్‌ఛార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులు బాధ్యతల్లో కొనసాగనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..