అయ్యో దేవుడా..! అంత్యక్రియల వేళ ఊహించని ఘటన.. శవయాత్రలో డప్పు కొడుతూ వ్యక్తి మృతి.. అతన్ని చూసి..

అంత్యక్రియల వేళ అనుకోని ఘటనతో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోపాల్ రావుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.. ఈ క్రమంలో మృతి చెందిన వ్యక్తి అంతిమయాత్ర సందర్భంగా డప్పు కొడుతున్న వ్యక్తికి గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అది చూసిన మరో వ్యక్తికి గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే కుప్పకూలాడు..

అయ్యో దేవుడా..! అంత్యక్రియల వేళ ఊహించని ఘటన.. శవయాత్రలో డప్పు కొడుతూ వ్యక్తి మృతి.. అతన్ని చూసి..
Crime News
Follow us
G Sampath Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 21, 2024 | 5:10 PM

అంత్యక్రియల వేళ అనుకోని ఘటనతో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోపాల్ రావుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.. ఈ క్రమంలో మృతి చెందిన వ్యక్తి అంతిమయాత్ర సందర్భంగా డప్పు కొడుతున్న వ్యక్తికి గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అది చూసిన మరో వ్యక్తికి గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే కుప్పకూలాడు.. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ఇద్దరు మృతిచెందడం.. మరొకరు తీవ్రమైన పరిస్థితిలో ఆసుపత్రిలో చేరడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది..

వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం గోపాలరావ్ పల్లి గ్రామానికి చెందిన మునిగి అంతయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అంతయ్య అంత్యక్రియల కోసం మంగళవారం రోజున ఏర్పాట్లు చేసుకొని గ్రామంలో శవయాత్ర చేస్తున్నారు. డప్పు చప్పుళ్లతో అంతయ్య మృతదేహాన్ని తీసుకెళ్తుండంగా మార్గ మధ్యలో డప్పు కొడుతున్న ఎడ్ల శంకర్ అనే వ్యక్తి అకస్మాత్తుగా కిందపడిపోయాడు.. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు.. దీంతో అక్కడ ఉన్న వారందరూ పట్టుకొని పక్కకు తరలించి మొహం పై నీళ్లు చల్లి లేపే ప్రయత్నం చేసారు. ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.. అప్పటికే శంకర్ మృతి చెందాడు.

శంకర్ మృతి చెందిన ఘటన చూసిన తంగళ్ళపల్లి ఎంపీటీసీ మునిగే దుర్గాప్రసాద్ హఠాత్తుగా కిందపడిపోయాడు.. అతనికి గుండెపోటు రావడంతో అక్కడ ఉన్నవారు దుర్గాప్రసాద్ కు ప్రాథమిక చికిత్స అందించి సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది. అన్న అంతయ్య శవ యాత్ర చేస్తున్న క్రమంలో ఎడ్ల శంకర్ మృతి చెందడం, దుర్గ ప్రసాద్ కు గుండెపోటు రావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..