Maheshwar Reddy: యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మంత్రి ఉత్తమ్‌పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో సీఎం, మంత్రులు వసూల్లకు పాల్పడుతున్నారంటూ లోక్ సభ ఎన్నికల ప్రచార వేళ ప్రధాని మోదీ సహా.. బిజేపి నేతలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో సీఎం, మంత్రులు వసూల్లకు పాల్పడుతున్నారంటూ లోక్ సభ ఎన్నికల ప్రచార వేళ ప్రధాని మోదీ సహా.. బిజేపి నేతలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. కొత్తగా రాష్ట్రంలో మరో ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ కీలక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు.
మహేశ్వరరెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. రైతుల ధాన్యం కొనుగోలు రచ్చ కొనసాగుతున్న వేళ.. క్వింటాకు 10 నుంచి 12 కేజీలు అదనంగా జోకుతూ (తూకం) దోచుకుంటున్నారని బిజెఎల్పీ నేత మహేశ్వరెడ్డి ఆరోపించారు. ఏటా కొనుగోలు అయ్యే కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతో పోల్చితే దాదాపు 13 వేల మెట్రిక్ టన్నులు దోచుకున్నట్లేనని.. ఇలా వందల కోట్ల రూపాయలు సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబుల్లోకి వెళ్లినట్లు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
ఇటీవల దాదాపు 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించిన మహేశ్వరరెడ్డి.. సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అందులో వంద కోట్ల రూపాయలను ఢిల్లీకి ఎన్నికల ఖర్చు కోసం పంపినట్లు చెప్పారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ కుమ్మక్కైయ్యారని.. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పుకోవాడని ఢిల్లీకి వంద కోట్లు పంపారని మహేశ్వరరెడ్డి ఆరోపించారు.
వీడియో చూడండి..
మిల్లర్ల నుంచి సీఎంఆర్ రైస్ నిధులు బకాయిలు ఉన్నా మళ్లీ వాళ్లకే ధాన్యం ఇస్తున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో ఉత్తమ్.. -యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని.. ఆరోపించిన బీజేపీ నేతలు.. ఇప్పుడు రాష్ట్రంలో యూ-ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..