TS Rain: చల్లని కబురు.. జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్

వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నట్లు అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ మీదుగా తెలంగాణకు చేరుకుంటాయి. ఇందుకు కనీసం అయిదారు రోజుల సమయం..

TS Rain: చల్లని కబురు.. జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
TS Rain
Follow us

|

Updated on: May 21, 2024 | 7:34 AM

హైదరాబాద్‌, మే 21: వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నట్లు అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ మీదుగా తెలంగాణకు చేరుకుంటాయి. ఇందుకు కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది. ఆ ప్రకారంగా చూస్తే జూన్‌ 5 నుంచి 8 తేదీల మధ్య రుతు పవనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది.

జూన్‌ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది ఆలస్యంగా రుతుపవనాలు జూన్‌ 11 నాటికి కేరళకు వచ్చాయి. తెలంగాణలో రావడానికి జూన్‌ 20వ తేదీ దాటింటి. కానీ ఈసారి సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో నైరుతి రుతువపనాల ఆగమనం కాస్తముందుగానే వచ్చేశాయి. దీంతో మండు టెండల నుంచి విముక్తి దొరకడంతోపాటు రైతన్నలు సకాలంలో సాగు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడది సాధారణ వర్షపాతం నమోదవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించింది. ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంగి, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఇంటీరియర్‌ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. దీంతో అది ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుంది. ఆ తర్వాత 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.