Telangana: బాలిక మృతికి కారణమైన డాక్టర్.. క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు!
వచ్చిన రాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్న వారిపై రాష్ట్ర వైద్య మండలి సీరియస్ అయ్యింది. సదరు నకిలీ డాక్టర్‌పై విచారణ చేపట్టింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నిల్వాయి పరిధిలోని కేతనపల్లి గ్రామంలో వైద్యం వికటించి పల్లవి అనే.12 సంవత్సరాల బాలిక ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై మంచిర్యాల జిల్లా వైద్యాధికారి నేతృత్వంలోని అధికార బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంఘటనపై విచారణ చేపట్టింది.

నెన్నెల గ్రామానికి చెందిన పల్లవి కుటుంబం వేసవికాలం సెలవులు ఉండడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ సందర్భంలో కడుపునొప్పి రావడంతో సమీపంలోని ఆర్ఎంపీ డాక్టర్ సంతోష్ దగ్గరికు తీసుకువెళ్లారు. సదరు ఆర్ఎంపీ ఒక ఇంజక్షన్ వేసి పంపించాడు. ఆ తర్వాత 12 గంటలు దాటక ముందే పల్లవి తెల్లవారుజామున మరోసారి కడుపునొప్పితోపాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురైంది. దీంతో వెంటనే బాలికను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కొరకు మంచిర్యాల తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది పల్లవి.
ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ వేయడం వల్లే, అది వికటించి బాలిక మృతి చెందిందని పల్లవి కుటుంబ సభ్యుల ఆరోపించారు. సదరు ఆర్ఎంపీపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం నెన్నలకు పల్లవి మృతదేహం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సదరు ఆరెంపీ నకిలీ వైద్యుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, ఐపీసీ సెక్షన్ 304 ii కింద కేసు నమోదు చేశారు. మరోవైపు జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…