AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: తగ్గేదేలే.. రూ. 75 వేల మార్క్‌ను దాటేసిన బంగారం ధర

బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. కాస్త శాంతిస్తున్నాయి అనుకుంటున్న సమయంలోనే మళ్లీ ధరలు భగ్గుమంటున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పసిడి పరుగులు పెడుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 75 వేల మార్క్‌ను దాటేసింది. దీంతో మార్కెట్ నిపుణులు చెబుతున్నట్లు తులం గోల్డ్‌ ధర రూ. లక్ష దాటడం ఖాయంగా కనిపిస్తోంది....

Gold Price Today: తగ్గేదేలే.. రూ. 75 వేల మార్క్‌ను దాటేసిన బంగారం ధర
Gold Price
Narender Vaitla
|

Updated on: May 21, 2024 | 6:27 AM

Share

బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. కాస్త శాంతిస్తున్నాయి అనుకుంటున్న సమయంలోనే మళ్లీ ధరలు భగ్గుమంటున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పసిడి పరుగులు పెడుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 75 వేల మార్క్‌ను దాటేసింది. దీంతో మార్కెట్ నిపుణులు చెబుతున్నట్లు తులం గోల్డ్‌ ధర రూ. లక్ష దాటడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 69060 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75320కి ఎగబాకింది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68910గా ఉంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,170 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 75,290 వద్ద కొనసాగుతోంది.

* అలాగే మరో ప్రధాన నగరమైన బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,910కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 75,170 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,910కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 75,170కి ఎగబాకింది.

* విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,910కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 75,170గా ఉంది.

* ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,910కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 75,170 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా రూ. 96,600కి చేరింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కిలో వెండి ధర రూ. లక్షకు చేరింది. ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 96,600కి చేరగా.. చెన్నై, హైదరాబాద్‌, కేరళ, మధురై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 101100కి చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..