AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: మీ డబ్బులకు భరోసా, మంచి రిటర్న్స్‌.. రెండేళ్లలోనే..

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టాఫీస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ పొందొచ్చు. పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఇలాంటి పథకాల్లో మహిళా సమ్మాన్‌ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌ ఒకటి. మహిళలకు ఆర్థిక స్వావలంభన తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఎంతగానో మేలు చేస్తోంది. ఇంతకీ మహిళా సమ్మాన్‌...

Post Office: మీ డబ్బులకు భరోసా, మంచి రిటర్న్స్‌.. రెండేళ్లలోనే..
Mahila Samman Yojana
Narender Vaitla
|

Updated on: May 21, 2024 | 8:13 AM

Share

ప్రస్తుత తరుణంలో డబ్బులను జాగ్రత్తగా కాపాడుకోవడం కష్టంగా మారింది. షేర్‌ మార్కెట్స్, ఆన్‌లైన్‌ గేమ్స్‌ అంటూ చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బును చేజేతులా కోల్పోతున్నారు. తెలిసో తెలియకో చేసే తప్పుతో ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. అయితే డబ్బును పొదుపు చేసుకోవడంతో పాటు మంచి ఆదాయం పొందే అవకాశాలు, అది కూడా ఎలాంటి రిస్క్‌ లేకుండా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పోస్టాఫీస్‌ గురించి.

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టాఫీస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ పొందొచ్చు. పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఇలాంటి పథకాల్లో మహిళా సమ్మాన్‌ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌ ఒకటి. మహిళలకు ఆర్థిక స్వావలంభన తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఎంతగానో మేలు చేస్తోంది. ఇంతకీ మహిళా సమ్మాన్‌ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌ అంటే ఏంటి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ స్కీం పథకం రెండేళ్ల కాల వ్యవధితో ఉంటుంది. ఇందులో మీరు కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టిన పెట్టుబబిపై 7.5 శాతం వార్షి వడ్డీ అందిస్తారు. ఉదాహరణకు మీరు గరిష్టంగా రూ. 2 లక్షలు డిపాజిట్‌ చేశారనుకుందాం. ఇందుకుగాను మీకు తొలి ఏడాది రూ. 15 వేల వడ్డీ లభిస్తుంది. రెండో ఏడాది ఈ రూ. 15 వేల వడ్డీతో కలుపుకొని మరో రూ. 16,125 వడ్డీ జమ అవుతుంది.

దీంతో రెండేళ్లలో మీరు పెట్టుబడి పెట్టిన రూ. 2 లక్షలకు రూ. 31,125 వడ్డీ పొందొచ్చు. ఈ లెక్కన మొత్తం రూ. 2,31,125 మీ సొంతం చేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్‌ లేకుండా, ఏ పనిచేయకుండా రూ. 30 వేలపై ఆర్జించవచ్చు. అలాగే మీ అసలు మళ్లీ అలాగే ఉంటుంది. మీరు ఒకవేళ ఈ స్కీమ్‌ను కొనసాగించుకోవాలంటే మళ్లీ మరో రెండేళ్లు పొడగించుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో పొందే వడ్డీ ఆదాయం రూ.40,000 దాటితే టీడీఈఎస్‌ వర్తిస్తుంది. ఇక ఈ స్కీమ్‌లో మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ పథకంలో డిపాజిట్‌ చేసిన వారికి ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పథకంలో పదేండ్ల వయసు దాటిన ఆడపిల్లలు ఎవరైనా చేరవచ్చు. ఈ పథకంలో చేరే వారు భారతీయులై ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..