Jio Smartphone: జియో యూజర్లకు అంబానీ గుడ్‌న్యూస్.. అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్ ఫోన్
రిలయన్స్ జియో ఏ నిర్ణయం తీసుకున్న అది సంచలనమే. టెలికం రంగంలో దూసుకుపోతున్న జియో.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసకోబోతోంది. జియో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. జియో 5G స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌తో వస్తుంది. అంతేకాకుండా 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతోఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, 6-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
Updated on: May 20, 2024 | 9:19 PM

ఈ Jio 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మీరు 33w ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుందట. 2 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే గురించి మాట్లాడినట్లయితే, ఇది 5.5 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో మీరు 4K నాణ్యతతో వీడియోలను సులభంగా చూడవచ్చు.

ఇప్పుడు చాలా మంది Jio 5G స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ రెండవ లేదా మూడవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని, విడుదల తేదీని కూడా పొందవచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా త్వరలో వెల్లడి కానుంది. అయితే ఈ ఫోన్ విడుదల సమయంలో రూ.3000 వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది.