Ambulance Booking: ఆపద వేళ ఆపన్న హస్తం.. ఆ యాప్ ద్వారా అంబులెన్స్ బుకింగ్స్ షురూ
ప్రస్తుత రోజుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రమాదం జరిగాక సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోతే ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసినా అది ఎక్కడ ఉందో తెలియక పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. కానీ ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు అకో యాప్ అంబులెన్స్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ముఖ్యంగా ఈ యాప్‌లో అంబులెన్స్ సేవలను బుక్ చేశాక అంబులెన్స్ ఎక్కడ ఉందో? ట్రాక్ చేసే సదుపాయం ఉంది. అందువల్ల అకో యాప్ అందించే అంబులెన్స్ సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.