- Telugu News Photo Gallery Business photos What Is The Secret Of 16 Digits In Credit Card Number? Do You Know These Four Secrets CVV Number Expiry Dates
Credit Card Numbers: క్రెడిట్ కార్డ్‌లోని 16 అంకెల రహస్యం ఏంటో తెలుసా? ఆసక్తికర విషయాలు
నేటి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్చేనారు. కానీ చాలా మందికి క్రెడిట్ కార్డ్ నంబర్, దాని అర్థం ఏంటో తెలియదు. కార్డుపై ఉన్న 16 సంఖ్యలు ఏమి చెబుతున్నాయి? క్రెడిట్ కార్డులపై ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిని పెద్దగా పట్టించుకోము. మరి క్రెడిట్ కార్డుపై..
Updated on: May 20, 2024 | 6:03 PM

క్రెడిట్ కార్డ్‌లోని మొదటి సంఖ్య ఏ కంపెనీ మీకు కార్డు జారీ చేసిందో సూచిస్తుంది. క్రెడిట్ కార్డ్ వీసా (VISA) అయితే సంఖ్య 4తో ప్రారంభమవుతుంది. మాస్టర్ కార్డ్ (Master Card) అయితే ఈ సంఖ్య 5తో మొదలవుతుంది. రూపే కార్డ్ (Rupay) అయితే 6వ నంబర్‌తో మొదలవుతుందని గుర్తించుకోండి.

ఏదైనా క్రెడిట్ కార్డు నంబర్‌లో మొదటి 6 అంకెలు మీ కార్డ్ జారీదారు గుర్తింపు సంఖ్య ఇష్యూయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (IIN). దీనిని బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (BIN) అని కూడా అంటారు. దాన్ని బట్టి ఈ క్రెడిట్ కార్డును ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ జారీ చేసిందో సూచిస్తుంది.

క్రెడిట్ కార్డ్ చివరి 9 అంకెల సంఖ్య. అంటే 7 నుండి సంఖ్య 15 వరకు ఉన్న సంఖ్యలు ఇది మీ క్రెడిట్ కార్డ్ ఖాతా సంఖ్య ఏమిటో తెలియజేస్తుంది. ఈ ఖాతా మీరు క్రెడిట్ కార్డ్‌ని కొనుగోలు చేసిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు చెందినది.

క్రెడిట్ కార్డ్ చివరి అంకెలను చెక్ అంకెలు అంటారు. ఈ నంబర్ ద్వారా, నకిలీ క్రెడిట్ కార్డులు మార్కెట్లోకి రాకుండా బ్యాంకు నిర్ధారిస్తుంది.

కార్డుపై 16 అంకెలతో పాటు, గడువు తేదీ కూడా రాసి ఉంటుంది. ఇది కార్డు ఎప్పుడు జారీ చేయబడింది? ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది? ఇది నెల, సంవత్సరాన్ని సూచిస్తుంది.

క్రెడిట్ కార్డ్ వెనుక 3-అంకెల ధృవీకరణ నంబర్ ఉంటుంది. దానినే CVV నంబర్ అంటారు. దీనిని బార్ కార్డ్ వెరిఫికేషన్ కోడ్ అని కూడా అంటారు. క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేసేటప్పుడు తరచుగా ఈ CVV నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.




