Telangana: ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దంటూ..
ఈ రకమైన మోసానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో సాగుతోన్న మోసాలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఈ నేరం ఎలా సాగుతుందంటే. ముందుగా నేరస్థులు ఫెడెక్స్ కొరియర్ కంపెనీ నుంచి అంటూ కాల్ చేస్తారు. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్‌తో పార్శిల్ వచ్చిందని అందులో అక్రమంగా...

సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.? ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజూ సైబర్ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఓటీపీ, ఓఎల్‌ఎక్స్ ఇలా రకరకాల మార్గాల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఫెడ్‌ఎక్స్ కొరియర్ పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి దోచుకుంటున్నారు.
ఈ రకమైన మోసానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో సాగుతోన్న మోసాలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఈ నేరం ఎలా సాగుతుందంటే. ముందుగా నేరస్థులు ఫెడెక్స్ కొరియర్ కంపెనీ నుంచి అంటూ కాల్ చేస్తారు. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్‌తో పార్శిల్ వచ్చిందని అందులో అక్రమంగా రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని భయాందోళనకు గురి చేస్తున్నారు.
డ్రగ్స్ రవాణా కేసులో శిక్షలు కఠినంగా ఉంటాయని.. కేసుల నుంచి తప్పించుకునేందుకు రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొందరు కంగారుపడి ఏం చేయాలో తెలియక నేరగాళ్లు అడిగినకాడికి ఇచ్చేస్తున్నారు. తీరా జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఫెడెక్స్ పార్సిల్స్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ని నమ్మొద్దని.. పోలీసులమని చెప్పగానే భయపడి డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే 1930 నంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
మీక్కూడా ఇలాంటి కాల్స్ వస్తే ఎలాంటి భయాందోనళలకు గురికాకుండా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. మనం తప్పు చేయనంత వరకు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను 1930 నంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
