AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: Hema: రేవ్‌ పార్టీలో లేనన్న నటి హేమ.. అటెండ్ అయ్యారంటూ వీడియో రిలీజ్‌ చేసిన బెంగళూరు పోలీసులు..!

బెంగళూరులో రేవ్‌ పార్టీకి వెళ్లింది. అయితే వెళ్లనే వెళ్లలేదని చెప్పింది. అదే టైమ్‌లో హైదరాబాద్‌లో ఓ ఫామ్‌ హౌస్‌లో చిల్ అవుతున్నానని చెప్పింది. అయితే సినీ నటి హేమ చెప్పిందేంటి? వాస్తవానికి జరిగిందేంటి? హేమ చెప్పిన అబద్ధాలు ఏంటి?

Actress: Hema: రేవ్‌ పార్టీలో లేనన్న నటి హేమ.. అటెండ్ అయ్యారంటూ వీడియో రిలీజ్‌ చేసిన బెంగళూరు పోలీసులు..!
Actress Hema
Balaraju Goud
|

Updated on: May 21, 2024 | 8:07 AM

Share

బెంగళూరులో రేవ్‌ పార్టీకి వెళ్లింది. అయితే వెళ్లనే వెళ్లలేదని చెప్పింది. అదే టైమ్‌లో హైదరాబాద్‌లో ఓ ఫామ్‌ హౌస్‌లో చిల్ అవుతున్నానని చెప్పింది. అయితే సినీ నటి హేమ చెప్పిందేంటి? వాస్తవానికి జరిగిందేంటి? హేమ చెప్పిన అబద్ధాలు ఏంటి?

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీకి సినీ నటి హేమ అటెండ్‌ అయ్యారంటూ కన్నడ మీడియా కోడై కూసింది. ఆ పార్టీకి తాను వెళ్లనే వెళ్లలేదు అన్నారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఓ ఫామ్‌హౌస్‌లో చిల్‌ అవుతున్నానని చెప్పారు ఆమె. అదంతా ఫేక్‌ న్యూస్‌ నమ్మొద్దండి అంటూ నవ్వుతూ చెప్పారు. తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు.

అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫొటోలు రిలీజ్ చేశారు. రేవ్‌ పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో కనిపించారు. డ్రెస్‌ మ్యాచ్ అయింది. హేమ మాటలు తూచ్‌ అయ్యాయి. ఇది అబద్ధం నెంబర్‌ వన్‌. ఇదెట్టా సాధ్యం అంటున్నారు జనం. బెంగళూరులో హైదరాబాద్‌లో ఒకే టైమ్‌లో ఒకే డ్రెస్సులో హేమ ఎట్టా కనిపిస్తారబ్బా.. ఆమె చెప్పింది అబద్ధం కాదా అంటున్నారు. ఇక, హైదరాబాద్‌ ఫామ్‌ హౌస్‌లో ఉన్నానంటూ హేమ రిలీజ్‌ చేసిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. అక్కడ ఉన్న చెట్లు, హేమ వీడియో చేసిన చెట్టు.. బెంగళూరు ఫామ్‌హౌస్‌లో ఉంది. హైదరాబాద్‌లో కాదు. ఇక దీనితో పాటు కెమెరాను ఇంకాస్త పక్కకు తిప్పితే బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ సెట్టింగ్‌ కూడా కనిపిస్తుంది. ఇది చెవిలో పూలు కాదు…చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు. ఆమె హైదరాబాద్‌లో కాదు బెంగళూరులోనే ఉన్నారని అక్కడి పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇది హేమ చెప్పిన అబద్ధం నెంబర్ 2.

ఇక రేవ్‌ పార్టీ గురించి మీడియా చెబితేనే, ఆ విషయం హేమ మేడమ్‌కి తెలిసిందిట. ఇది హేమ చెప్పిన మూడో అబద్ధం. కేసు లేదు గీసు లేదు. అసలు నన్ను ఎవ్వరూ పట్టుకోలేదు. ఇది కూడా హేమ చెప్పిన మాటే. ఇది హేమ చెప్పిన నాలుగో అబద్ధం. రేవ్‌ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు విచారించారు. ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఫామ్‌ హౌస్‌ గేటు నుంచి తెల్లటి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతూ కనిపించింది.

ఇలా అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు గుర్రుగా ఉన్నారు. పోలీసుల కస్టడీలో ఉండి పక్కకు వెళ్లి వీడియో తీసి మీడియాకు పంపి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హేమపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. హేమ చర్యపై అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారని తెలుస్తోంది. రేవ్‌ పార్టీలో పాల్గొన్న హేమను ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు విచారించారు. ఇక గతంలోనూ అనేక వివాదాల్లో హేమ పేరు మార్మోగింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి… 

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్