Actress Vidya Murder Case: ‘భజరంగీ’ మువీ నటి దారుణ హత్య.. భర్తే హంతకుడు!
బ్లాక్ బాస్టర్ మువీ 'భజరంగీ' నటి, కాంగ్రెస్ నేత విద్య (36) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. నటి విద్యను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. మైసూర్‌లోని తన ఇంట్లో ఈ దారుణ ఘటన జరిగింది. హత్య అనంతరం ఆమె భర్త నందీష్ పరార్ అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా నటి విద్య, నందీష్‌ని 2018లో వివాహం చేసుకుంది. వివాహనంతరం కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు..
బ్లాక్ బాస్టర్ మువీ ‘భజరంగీ’ నటి, కాంగ్రెస్ నేత విద్య (36) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. నటి విద్యను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. మైసూర్‌లోని తన ఇంట్లో ఈ దారుణ ఘటన జరిగింది. హత్య అనంతరం ఆమె భర్త నందీష్ పరార్ అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా నటి విద్య, నందీష్‌ని 2018లో వివాహం చేసుకుంది. వివాహనంతరం కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచూ ఈ జంట గొడవపడుతుండేది. దీంతో విద్య భర్త నందీష్ విడాకులు తీసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కాని అతని తల్లిదండ్రులు తెలివిగా వ్యవహరించి వారిద్దరికీ రాజీ కుదిర్చారు. అయినా వారి మధ్య గొడవలు సర్దుమనగలేదు. తాజాగా వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో విద్య మైసూరులోని తుర్గనూర్‌లో ఉన్న తన భర్త ఇంటి నుంచి నుంచి బెంగళూరులోని తన స్వగ్రామమైన శ్రీరాంపూర్‌కు వచ్చింది.
మే 20న నందీష్, విద్య మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందో తెలియదుగానీ విద్య రాత్రికి రాత్రే శ్రీరాంపూర్ నుంచి బయలుదేరి మైసూర్‌లోని తుర్గనూర్ చేరుకుని భర్తతో ముఖాముఖిగా గొడవకు దిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్త నందీష్ విద్యపై సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విద్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నందీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బన్నూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులు, బంధువుల నుంచి అవసరమైన సమాచారం సేకరించారు. మైసూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సీమా లట్కర్, అదనపు ఎస్పీ డాక్టర్ నందిని, నంజన్‌గూడు డీవైఎస్పీ గోవిందరాజులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు నందీష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
శాండల్‌వుడ్‌లో జూనియర్ ఆర్టిస్ట్ అయిన విద్య ‘భజరంగీ’, ‘వజ్రకాయ’, ‘వేద’, ‘జై మారుతి 800’, ‘అజిత్’ వంటి ఎన్నో హిట్ మువీల్లో సహాయ నటిగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. భజరంగీ మువీలో ఆమె నటనుక మంచి మార్కులు పడ్డాయనే చెప్పవచ్చు. విద్యా నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు నటిగా వరుస చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూనే.. రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉండేది. గతంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన విద్యా ప్రస్తుతం మైసూర్ సిటీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా క్రియాశీలకంగా వ్యవహరించారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.