Bangalore Rave Party: హేమ అక్కా అంటూనే ఇచ్చిన పడేసిన కరాటే కల్యాణీ.. గురివింద గింజ అంటూ
బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీసు కమిషనర్ దయానంద్ మంగళవారం ప్రకటించారు. ‘రేవ్ పార్టీతో నాకేమీ సంబంధం లేదు. కావాలని నా పేరు ప్రచారం చేస్తున్నారు’ అని ఆమె తప్పుడు ప్రచారానికి దిగారని దయానంద్ వివరించారు. దీంతో హేమపై నెట్టింట ట్రోల్స్ పేలుతున్నాయి...
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటీనటులు పాల్గొన్నట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అందులో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ‘నేనేమీ ఆ పార్టీకి హాజరు కాలేదు’ అంటూ ఆమె బుకాయిస్తన్నప్పటికీ.. రేవ్ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీసు కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. దీంతో జనాలను చీట్ చేయాలని చూసిన హేమపై నెట్టింట ట్రోల్స్ పేలుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మరో నటి కరాటే కల్యాణీ హేమపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇండస్ట్రీ వాళ్లను ఉద్దరిస్తున్నట్లు కలరింగే ఇచ్చే హేమ నిజ స్వరూపం ఇప్పుడు బట్టబయలు అయిందని కల్యాణీ చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో సరదాగా పేకాడుతూ దొరికితే.. తానేదో పెద్ద తప్పు చేసినట్లు బిల్డప్ ఇచ్చిందన్నారు. మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుందని.. చాలా పనిష్‌మెంట్స్ తీసుకోడానికి హేమ రెడీగా ఉండాలన్నారు కల్యాణీ. అయితే హేమ డ్రగ్స్ కేసు నుంచి బయటకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.