AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Buried Alive Video: బతికుండగానే వృద్ధుడిని పూడ్చిపెట్టారు.. 4 రోజుల తర్వాత తవ్వి చూడగా! వీడియో వైరల్

మోల్డోవా అనే యూరోపియన్‌ దేశంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 62 ఏళ్ల వృద్ధుడిని ఓ వ్యక్తి బ్రతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు. నాలుగు రోజుల పాటు భూమిలోనే ఉన్న ఆ వృద్ధుడిని పోలీసులు అనూహ్యంగా బయటకు తీసుకొచ్చి ప్రాణం పోశారు. ఈ షాకింగ్‌ ఘటన ఈ నెల 13న మోల్డోవాలోని ఉస్టియా(Ustia) అనే గ్రామంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

Man Buried Alive Video: బతికుండగానే వృద్ధుడిని పూడ్చిపెట్టారు.. 4 రోజుల తర్వాత తవ్వి చూడగా! వీడియో వైరల్
Man Buried Alive
Srilakshmi C
|

Updated on: May 21, 2024 | 9:20 AM

Share

మోల్డోవా అనే యూరోపియన్‌ దేశంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 62 ఏళ్ల వృద్ధుడిని ఓ వ్యక్తి బ్రతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు. నాలుగు రోజుల పాటు భూమిలోనే ఉన్న ఆ వృద్ధుడిని పోలీసులు అనూహ్యంగా బయటకు తీసుకొచ్చి ప్రాణం పోశారు. ఈ షాకింగ్‌ ఘటన ఈ నెల 13న మోల్డోవాలోని ఉస్టియా(Ustia) అనే గ్రామంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. మోల్డోవాలో 74 ఏళ్ల మహిళ హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సదరు మహిళ ఇంట్లోనే కిరాతకంగా హత్యకు గురైంది. మహిళ హత్య జరిగినప్పటి నుంచి భర్త ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మృతురాలి భర్త కోసం గాలించడం ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలీసులు మహిళ ఇంటికి చేరుకోగా.. ఇంటి నేల కింద నుంచి వస్తున్న మూలుగులు, కేకలు విన్నారు. దీంతో వెంటనే వారు అక్కడ తవ్వకాలు చేపట్టారు.

అలా తవ్వుతుంటే నేల కింద ఉన్న తాత్కాలిక నేలమాళిగ వారికి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా అక్కడ బతికున్న 62 ఏళ్ల వ్యక్తి వారికి కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అతను స్పృహలో ఉన్నప్పటికీ అతని మెడ, ముఖంపై గాయాల గుర్తులు కనిపించాయి. నాలుగు రోజులుగా అతను అక్కడ చిక్కుకుపోయినట్లు గుర్తించారు. తన బంధువైన 18 ఏళ్ల యువకుడు ఒకడు తనని ఇలా పూడ్చేశాడని తెలిపాడు. ఈ ఘటన మే 18వ తేదీ రాత్రి జరిగినట్లు వృద్ధుడు తెలిపాడు. ఆ రోజు రాత్రి వృద్ధుడు, యువకుడు కలిసి మద్యం సేవించారు. అయితే వారి మధ్య గొడవ జరిగడంతో యువకుడు వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని యువకుడు బేస్‌మెంట్‌లో బంధించి, దాని ముఖద్వారాన్ని మట్టితో కప్పివేశాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత సదరు యువకుడు వృద్ధుడి భార్యను కూడా హత్య చేశాడు. హత్య జరిగిన విషయం బయటికి పొక్కడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా మహిళ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో వృద్ధుడి ఆచూకీ లభ్యమైంది. దీంతో పోలీసులు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ కేసులో నేరం రుజువైతే నిందితుడికి జీవితకాల ఖైదు విధించే అవకాశం ఉంది. ఈ ఘటన వృద్ధులపై జరుగుతున్న హింసను వెలుగులోకి తెచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?