US Marijuana: అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట.!

US Marijuana: అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట.!

Anil kumar poka

|

Updated on: May 21, 2024 | 10:50 AM

అమెరికాలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడింది. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్‌-3 డ్రగ్‌ నుంచి షెడ్యూల్‌-1 డ్రగ్‌ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి మార్చారు. గంజాయిని కలిగి ఉన్నా.. లేదా సేవించినా ఇక నుంచి జైలుకేం వెళ్లరు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా చేసిన పోస్ట్‌ ఇది.

అమెరికాలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడింది. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్‌-3 డ్రగ్‌ నుంచి షెడ్యూల్‌-1 డ్రగ్‌ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి మార్చారు. గంజాయిని కలిగి ఉన్నా.. లేదా సేవించినా ఇక నుంచి జైలుకేం వెళ్లరు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా చేసిన పోస్ట్‌ ఇది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఫెడరల్‌ పాలసీని ప్రతిపాదించినట్లు బైడెన్‌ ప్రభుత్వం చెబుతోంది. అమెరికాలో మాదకద్రవ్యాల నిషేధిత చట్టం 1937లో వచ్చింది. రేసిజం నేపథ్యంలోనే ఈ చట్టాన్ని రూపొందించారు ఆ తర్వాత మైనర్‌లు డ్రగ్స్‌ బారిన పడుతున్నారని 1970లో కొత్త చట్టం తెచ్చారు. అదే కంట్రోల్డ్‌ సబ్‌స్టెన్సెస్‌ యాక్ట్‌. దీని ప్రకారం గంజాయి షెడ్యూల్‌-1 డ్రగ్‌ కింద వస్తుంది. ఈ షెడ్యూల్‌-1 డ్రగ్స్‌లో హెరాయిన్‌, ఎల్‌ఎస్డీ, ecstasy వంటివి కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైన డ్రగ్స్‌ అని, వీటిని సేవించినా.. కనీసం కలిగి ఉన్నట్లు రుజువైనా కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న గంజాయిని.. షెడ్యూల్‌ 3 డ్రగ్స్‌లోకి మార్చేందుకు ప్రతిపాదన చేశారు.

షెడ్యూల్‌-3 డ్రగ్స్‌లో కెటమైన్‌, పెయిన్‌కిలర్స్‌లో వాడే కోడైన్‌ ఉండనున్నాయి. గంజాయిని ఇందులోంచి మినహాయించడంతో.. ఇక నుంచి గంజాయి బ్యాచ్‌లకు కాస్త ఊరట కలగనుంది. అలాగని అమెరికాలో గంజాయిని కలిగి ఉండడం చట్టబద్ధం అని మాత్రం కాదు. కాకుంటే.. ఇంతకు ముందు స్థాయిలో మాత్రం అరెస్టులు ఉండకపోవచ్చు. వాస్తవానికి గంజాయిని ప్రమాదకరమైన డ్రగ్స్‌ జాబితాను తొలగించే ప్రయత్నాలు బైడెన్‌ హయాంలో 2022లోనే మొదలయ్యాయి. అయితే.. డ ప్రతిపాదనను మాత్రం బైడెన్‌ ప్రభుత్వం ఈ ఏప్రిల్‌ చివరి వారంలోనే రూపొందించింది. జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ మాత్రం ఆ ప్రాసెస్‌ను అధికారికంగా గురువారం నుంచే ప్రారంభించింది. అంటే.. ఆ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడేదాకా ఇంకొంచెం సమయం పడుతుంది. అప్పటిదాకా ఇది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోనే కొనసాగనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.