India: భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! ‘దేశీస్‌ డిసైడ్‌’ సదస్సులో వ్యాఖ్యలు..

India: భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! ‘దేశీస్‌ డిసైడ్‌’ సదస్సులో వ్యాఖ్యలు..

Anil kumar poka

|

Updated on: May 21, 2024 | 9:26 AM

భారత్‌ వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉందనీ అలాంటి వారికి మానవ హక్కుల గురించి చెప్పడం హితబోధ చేసినట్లవుతుందనీ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా అన్నారు. వందల సంవత్సరాలుగా వలసవాద శక్తులు ఉపన్యాసాలు ఇస్తున్నాయని భారత్‌ స్పష్టం చేసిందని అలాంటప్పుడు అమెరికా మాటలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని అన్నారు. రెండు దేశాల్లోని లోపాలను గుర్తించి.. వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలి?

మానవ హక్కులపై భారత్‌కు పాఠాలు చెప్పడం సరికాదని ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. భారత్‌కు హితవు చెప్పేముందు అమెరికా తన వ్యవస్థలోని లోపాలనూ గమనించాలని అభిప్రాయపడ్డారు. ‘దేశీస్‌ డిసైడ్’ సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉందనీ అలాంటి వారికి మానవ హక్కుల గురించి చెప్పడం హితబోధ చేసినట్లవుతుందనీ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా అన్నారు. వందల సంవత్సరాలుగా వలసవాద శక్తులు ఉపన్యాసాలు ఇస్తున్నాయని భారత్‌ స్పష్టం చేసిందని అలాంటప్పుడు అమెరికా మాటలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని అన్నారు. రెండు దేశాల్లోని లోపాలను గుర్తించి.. వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలి? ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ఎలా కాపాడుకోవాలి? అనే ధోరణిలో చర్చించుకుంటే మేలు అన్నారు.

ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛ, బలమైన ప్రతిపక్షం ఉండాలని మరో భారత సంతతి చట్టసభ సభ్యుడు అమీ బేరా చెప్పారు. అమెరికా వ్యవస్థలోని పరిమితులనూ లేవనెత్తాల్సిన అవసరం ఉందని మరో సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇతర దేశాల్లోని లోపాల గురించి మాట్లాడొచ్చని అన్నారు. అగ్రరాజ్య ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అమెరికాకు భారత్‌ కీలక భాగస్వామి అని గుర్తుచేశారు. ప్రాంతీయ అవసరాలతో పాటు ఇతర అంశాల్లో భారత్‌ అవసరం ఉందని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.