Tissue Paper: టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో కలకలం రేగింది. సిబ్బంది, ప్రయాణికులు కాసేపు టెన్షన్‌కు గురయ్యారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లేందుకు ఎయిరిండియా విమానం సిద్ధమైంది. అంతలోనే అందులోని వాష్‌రూంలో ‘బాంబ్‌’ అని రాసిఉన్న ఓ టిష్యూ పేపర్‌ సిబ్బంది కంటపడింది. దీంతో అప్రమత్తమైన వారు వెంటనే ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు.

Tissue Paper: టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!

|

Updated on: May 21, 2024 | 9:15 AM

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో కలకలం రేగింది. సిబ్బంది, ప్రయాణికులు కాసేపు టెన్షన్‌కు గురయ్యారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లేందుకు ఎయిరిండియా విమానం సిద్ధమైంది. అంతలోనే అందులోని వాష్‌రూంలో ‘బాంబ్‌’ అని రాసిఉన్న ఓ టిష్యూ పేపర్‌ సిబ్బంది కంటపడింది. దీంతో అప్రమత్తమైన వారు వెంటనే ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సీఐఎస్‌ఎఫ్‌తోపాటు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు.

భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే, అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు అందరినీ సురక్షితంగా కిందకు దించేశామనీ భద్రతా సంస్థలు తనిఖీలు చేపట్టాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు వారికి వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. వారితోపాటు సిబ్బంది భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. తర్వాత ప్రత్యేక విమానంలో ప్రయాణికులు వడోదరకు బయలుదేరి వెళ్లారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us