Viral: పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
పురుషుల సంతాన లేమికి తల్లి నుంచి సంక్రమించే లోపభూయిష్ట జన్యువు కారణమని తొలిసారిగా CCMB అధ్యయనంలో తేలింది. ఎక్స్ క్రోమోజోమ్‌లో ఈ జన్యువు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. హైదరాబాద్‌లోని CCMB, ఇతర పరిశోధన సంస్థలకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలను CCMB గురువారం వెల్లడించింది.

పరిశోధకుల ప్రకారం, ప్రపంచంలోని ప్రతి ఏడు జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం, శుక్రకణాల, సైజు, నిర్మాణం కదలికల్లో లోపాలు కారణంగానే సగం సందర్భాల్లో పురుషుల్లో సంతానలేమి తలెత్తుతోంది. అయితే, పురుషులకు వారి తల్లుల నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యులోపమే ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అత్యాధునిక జన్యుక్రమ విశ్లేషణ పద్ధతులతో శాస్త్రవేత్తలు సంతానలేమితో బాధపడుతున్న పురుషులు, ఆరోగ్యవంతుల జన్యువులను విశ్లేషించారు. ఈ క్రమంలో సంతానలేమితో బాధపడుతున్న పురుషుల్లోని ఎక్స్ క్రోమోజోమ్‌లో TEX 13 B అనే లోపభూయిష్ట జన్యువును గుర్తించారు. మరో జన్యువు కూడా వీరిలో అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.