Curd: పెరుగుతో కాన్సర్‌కు చెక్.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. ఈ మాయదారి రోగం ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం అంత సులువు కాదు. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా, అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా క్యాన్సర్ మహమ్మారిని మాత్రం పూర్తిగా జయించలేని పరిస్థితి. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన విధానం కారణంగా క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. ఈ మాయదారి రోగం ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం అంత సులువు కాదు. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా, అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా క్యాన్సర్ మహమ్మారిని మాత్రం పూర్తిగా జయించలేని పరిస్థితి. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన విధానం కారణంగా క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక క్యాన్సర్ విషయంలో ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులే నమోదవుతున్నాయి. అయితే జీవన విధానంలో చేసుకునే మార్పుల ద్వారా ఈ క్యాన్సర్ మన దరిచేరకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే ఊపిరిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 19% వరకు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. పెరుగుతో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17% తక్కువగా ఉంట్టున్నట్టు తేలింది. ఇందుకోసం పరిశోధకులు మొత్తం 14 లక్షల మందిని పరిగణలోకి తీసుకొని వారిపై పరిశోధనలు నిర్వహించారు. భవిష్యత్తులో లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో పెరుగు, ఫైబర్ కంటెంట్ కచ్చితంగా ఉండాలని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.