అప్పు చెల్లించలేదనీ అమానుషం.. రైతు భార్య పిల్లలను తీసుకెళ్లి 2 రోజులుగా నరకం! ఆ తర్వాత ఏం జరిగిందంటే

పొలం సాగు కోసం ఓ రైతు గ్రామంలోని ఓ మహిళ వద్ద అప్పు చేశాడు. అయితే తీవ్ర కరువు వల్ల పంట చేతికి రాకపోగా చేసిన అప్పు కొండలా పెరిగింది. దీంతో అప్పుఇచ్చిన మహిళ రైతు ఇంటికి వచ్చి నానాయాగి చేసింది. అతని భార్య, పిల్లలను తీసుకెళ్లి గృహనిర్భంధంలో ఉంచింది. గృహనిర్బంధంలో ఉంచిన భార్య, కొడుకులకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వకుండా నరకం చూపించింది. దీంతో వారిని విడిపించలేక, అప్పుకట్టలేక మనస్తాపం..

అప్పు చెల్లించలేదనీ అమానుషం.. రైతు భార్య పిల్లలను తీసుకెళ్లి 2 రోజులుగా నరకం! ఆ తర్వాత ఏం జరిగిందంటే
Farmer's Wife And Son Put Under House Arrest
Follow us

|

Updated on: May 21, 2024 | 11:33 AM

బెళగావి, మే 21: పొలం సాగు కోసం ఓ రైతు గ్రామంలోని ఓ మహిళ వద్ద అప్పు చేశాడు. అయితే తీవ్ర కరువు వల్ల పంట చేతికి రాకపోగా చేసిన అప్పు కొండలా పెరిగింది. దీంతో అప్పుఇచ్చిన మహిళ రైతు ఇంటికి వచ్చి నానాయాగి చేసింది. అతని భార్య, పిల్లలను తీసుకెళ్లి గృహనిర్భంధంలో ఉంచింది. గృహనిర్బంధంలో ఉంచిన భార్య, కొడుకులకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వకుండా నరకం చూపించింది. దీంతో వారిని విడిపించలేక, అప్పుకట్టలేక మనస్తాపం చెందిన రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నాటక జిల్లాలోని హుక్కేరి తాలూకా ఇస్లాంపుర గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కర్నాటక జిల్లాలోని హుక్కేరి తాలూకా ఇస్లాంపుర గ్రామానికి చెందిన సిద్దవ బయ్యనవర అనే మహిళ వద్ద రాజు ఖోటాగి అనే రైతు ఐదు నెలల క్రితం రూ. లక్షన్నర అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పుకు గానూ నెలకు శాతం 10% మేర వడ్డీ కూడా వసూలు చేస్తూ వచ్చింది. రెండు రోజుల క్రితం సిద్దవ్వ హఠాత్తుగా రాజును ఇంటికి పిలిపించి అప్పు తిరిగి ఇవ్వాలని హెచ్చరించింది. దీంతో అప్పు చెల్లించేందుకు తనకు రెండ్రోజులు గడువు కావాలని కోరిన రాజు.. ఆ అప్పు సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో అప్పుగా తీసుకున్న సొమ్ము చెల్లించేంత వరకు అతని కొడుకును తన ఇంట్లోనే వదిలిపెట్టాలని మహిళ కోరింది. దీంతో గత్యంతరంలేక ఆమె చెప్పిన విధంగా రాజు తన కుమారుడు బసవరాజ్‌ను ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. మరుసటి రోజు కుమారుడిని చేసేందుకు వెళ్లిన రాజు భార్య దుర్గవ్‌ను కూడా సదరు మహిళ బలవంతంగా తన ఇంట్లో ఉంచింది. దీంతో మనస్తాపానికి గురైన రాజు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజుకి అప్పు ఇచ్చిన సిద్దవ్వ 2 రోజులుగా చుక్క నీరు, పిడికెడు అన్నం కూడా ఇవ్వకుండా అతని భార్య, కొడుకులను గృహనిర్భంధం చేసింది. కసాయితనంగా రాజు భార్య దుర్గవ్వ, కుమారుడు బసవరాజుని సిద్దవ్వ గృహనిర్బంధంలో ఉంచినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులకు సిద్దవ్వపై ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేయలేదని.. ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లో పడిగాపులు కాసినట్లు దుర్గవ్వ, ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం యమకనమరడి పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.