PM Modi: ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు పంచేస్తారా..?
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు. ఈ సందర్భంగా అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గుట్టలపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు. ఈ సందర్భంగా అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గుట్టలపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాన్ని పేదలకు తిరిగి పంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని అన్నారు. ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం న్యాయబృందం సలహా కోరుతామనీ చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోమని చెప్పారు. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయవ్యవస్థను కోరానని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.