Telangana: ఆ విషయంలో ఏకైక సీఎం రేవంత్ రెడ్డి.. ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ – Watch Video
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. అతితక్కువ కాలంలో ప్రజల నుంచి చీత్కారం అందుకున్న ఏకైక సీఎం.. రేవంత్ రెడ్డి అంటూ గరంగరం అయ్యారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్.. అతి తక్కువ కాలంలో ఎక్కువ అక్రమ డబ్బులు వసూలు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. అతితక్కువ కాలంలో ప్రజల నుంచి చీత్కారం అందుకున్న ఏకైక సీఎం.. రేవంత్ రెడ్డి అంటూ గరంగరం అయ్యారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్.. అతి తక్కువ కాలంలో ఎక్కువ అక్రమ డబ్బులు వసూలు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా స్వయంగా RR టాక్స్ గురించి చెప్పారంటే ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆవురావురమన్నట్టు ఉన్నారని.. ఎప్పటివరకు ఉంటామో తెలీదని అంతా సర్దుకొని పెట్టుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో బిల్డింగ్ పర్మిషన్‌కు కాంగ్రెస్ వాళ్లకు సపరేట్ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజలు బిక్ష పెడితే సీఎం పదవి వచ్చిందన్న ఈటల.. అదే ప్రజలు దెబ్బకొడితే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు.