AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR Aarogyasri: నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌.. చేతులెత్తేసిన ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు!

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నెట్ వర్క్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. మంగళవారం రాత్రి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోషిషన్ (ఆశా) తో ఆరోగ్యశ్రీ సీఈవో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న జరిగిన జూమ్ మీటింగ్‌లో ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తుందని సీఈవో లక్ష్మీశా చెప్పినప్పటికీ గతంలో కూడా ఇదే చెప్పారని, వెంటనే బకాయిలు చెల్లించకుంటే రోగులకు చికిత్స అందించడాన్ని..

YSR Aarogyasri: నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌.. చేతులెత్తేసిన ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు!
YSR Aarogyasri
Srilakshmi C
|

Updated on: May 22, 2024 | 8:36 AM

Share

అమరావతి, మే 22: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నెట్ వర్క్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. మంగళవారం రాత్రి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోషిషన్ (ఆశా) తో ఆరోగ్యశ్రీ సీఈవో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న జరిగిన జూమ్ మీటింగ్‌లో ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తుందని సీఈవో లక్ష్మీశా చెప్పినప్పటికీ గతంలో కూడా ఇదే చెప్పారని, వెంటనే బకాయిలు చెల్లించకుంటే రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేస్తామని ఆశా స్పష్టం చేసింది.

నెట్ వర్క్ హాస్పిటల్స్‌లో రూ. 15 వందల కోట్లు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు 8 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించకపోవడంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నట్లు ఆశా యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి అవినాష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని స్పష్టం చేశారు.

అటు ప్రైవేట్‌ వైద్య కాలేజీల్లోనూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీస్‌ అసోసియేషన్‌ మంగళవారం ప్రకటన జారీ చేసింది. కొవిడ్‌-19 కింద అందించిన చికిత్స బిల్లులతో సహా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు సుమారు 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెల్లించడంలేదని, బకాయిలు చెల్లించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలు అందించబోమని తెలిపారు. మందుల ఖర్చులు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి మాత్రమే వైద్యం అందిస్తామని తెలిపారు. అలాగే వ్యాధి నిర్థారణ పరీక్షలకు 50 శాతం రాయితీ అందిస్తామన్నారు. సర్జరీలు కూడా ఉచితంగా చేస్తాన్నారు. ఇప్పటికే ఇన్‌పేషెంట్లుగా ఉన్న వారికి మాత్రం ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని తమ ప్రకటనలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యశ్రీకి రూ.203 కోట్ల నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్‌.. అయినా ఆగని స్ట్రైక్! ఎందుకంటే

ఏపీలోని నెట్‌వర్క్‌ హాస్పిటల్లో పెండింగ్ నిధులు విడుదల చేయాలంటూ నేటి నుంచి స్ట్రైక్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా రూ.203 కోట్ల నిధులు బుధవారం ఉదయం విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోషిషన్ (ఆశా) అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం బకాయిల్లో కేవలం రూ.203 కోట్లు విడుదల చేయడం ఏంటని ప్రశ్నిస్తుంది. మార్చ్ 31 వరకు ఉన్న పెండింగ్ నిధులు మొత్తం విడుదల చేసే వరకు స్ట్రైక్ కొనసాగుతుందని, అప్పటి వరకుఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆశా తేల్చి చెప్పింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్