AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Anwarul Azim Anar: కోల్‌క‌తాలో బంగ్లాదేశ్‌ ఎంపీ దారుణ హ‌త్య.. మృతదేహం మిస్సింగ్‌!

బంగ్లాదేశ్‌కు చెందిన అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ దారుణ హత్యకు గురయ్యారు. చికత్స కోసం బంగ్లా నుంచి భారత్‌కు వచ్చిన ఆయనను కోల్‌క‌తాలో హత్యకు గురయ్యారు. కోల్‌కతాలోని న్యూటౌన్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఆయనను మ‌ర్డర్ చేసిన‌ట్లు మంత్రి అస‌దుజ్జమాన్ ఖాన్ తెలిపారు. అపార్ట్మెంట్‌లో రక్తపు మరకలు ఉండగా.. మృతదేమాలు హంతకులు మాయం చేశారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ..

MP Anwarul Azim Anar: కోల్‌క‌తాలో బంగ్లాదేశ్‌ ఎంపీ దారుణ హ‌త్య.. మృతదేహం మిస్సింగ్‌!
Bangladesh MP Murder case
Srilakshmi C
|

Updated on: May 23, 2024 | 8:36 AM

Share

ఢాకా, మే 23: బంగ్లాదేశ్‌కు చెందిన అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ దారుణ హత్యకు గురయ్యారు. చికత్స కోసం బంగ్లా నుంచి భారత్‌కు వచ్చిన ఆయనను కోల్‌క‌తాలో హత్యకు గురయ్యారు. కోల్‌కతాలోని న్యూటౌన్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఆయనను మ‌ర్డర్ చేసిన‌ట్లు మంత్రి అస‌దుజ్జమాన్ ఖాన్ తెలిపారు. అపార్ట్మెంట్‌లో రక్తపు మరకలు ఉండగా.. మృతదేమాలు హంతకులు మాయం చేశారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కోనసాగుతోంది. ఈ హ‌త్య కేసుతో లింకులున్న ముగ్గురు వ్యక్తుల‌ను ఢాకాలోని వరీ ప్రాంతంలో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంపీ అన్వరుల్‌ను హ‌త్య చేసిన ముగ్గురు నిందితులూ బంగ్లాదేశీలుగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారం మ‌ర్డర్ జ‌రిగినట్లు చెబుతున్నారు. బంగ్లా సీనియర్‌ నేత అయిన అన్వరుల్ హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. పశ్చిమబెంగాల్‌ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. బంగ్లాలోని జెనాయిదా-4 నియోజ‌క‌వ‌ర్గం నుంచి అజిమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జెనాయిదా బోర్డర్ ప్రాంత‌ం. అక్కడ క్రైం రేట్ ఎక్కువ‌గా ఉంటుంది. మే 12న ఎంపీ అన్వర్‌ నార్త్‌ కోల్‌కతాలోని బారానగర్‌లో తనకు పరిచయస్తుడైన గోపాల్‌ బిశ్వాస్‌ ఇంటికి వచ్చారు. మే 13న మధ్యాహ్నం డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఉందని చెప్పి అన్వర్‌ బయటకు వెళ్లిన ఎంపీ అన్వర్‌ ఎంతకీ తిరిగిరాలేదు. అనంతరం గోపాల్‌ ఫోన్‌కు అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చాయి. అయితే మే 17దాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ రాలేదు. దీంతో అనుమానం వచ్చిన గోపాల్‌ మే 18న మిస్సింగ్‌ కేసు పెట్టారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మే 13న అన్వర్‌ చివరిసారిగా సంజీబ్‌ ఘోష్‌కు చెందిన అపార్ట్‌మెంట్‌లోనికి ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్‌మెంట్‌ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్‌ రాలేదు. అపార్ట్‌మెంట్‌లో రక్తాపు మరకలు ఉండటంతో అన్వర్‌ మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. ఎక్కడైనా పడేసి ఉంటారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్ మామున్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘భారత్‌ పోలీసులు, మేము సంయుక్తంగా ఎంపీ హత్య కేసులో పని చేస్తున్నాం. మేము భారత పోలీసులకు సహకరిస్తున్నామని’ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.