Viral Video: ‘బహువచనం అంటే.. అత్తమామల మాట వినే కోడలు’ ఎగ్జాంలో విద్యార్ధి రాసిన ఆన్సర్‌! వీడు మామూలు జాతిరత్నం కాదుగా..

స్కూల్‌ పిల్లల తెలివి తేటల ముందు ఐన్‌స్టీన్‌ తెలివితేటలు ఎంత? అనే డౌట్‌ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్లు చేసే పనులను బట్టి అనిపిస్తుంటుంది. ఇంత క్రియేటివ్‌గా ఎలా ఆలోచిస్తారబ్బా.. అని నాలుక కరుచుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇక వాళ్లు ఎగ్జామ్స్‌లో రాసే ఆన్సర్లు వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇలాంటి నవ్వు తెప్పించే జవాబులు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. అఫ్‌కోర్స్‌.. చిన్న తనంలో..

Viral Video: 'బహువచనం అంటే.. అత్తమామల మాట వినే కోడలు' ఎగ్జాంలో విద్యార్ధి రాసిన ఆన్సర్‌! వీడు మామూలు జాతిరత్నం కాదుగా..
Student's Hilarious Answers
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2024 | 9:53 AM

స్కూల్‌ పిల్లల తెలివి తేటల ముందు ఐన్‌స్టీన్‌ తెలివితేటలు ఎంత? అనే డౌట్‌ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్లు చేసే పనులను బట్టి అనిపిస్తుంటుంది. ఇంత క్రియేటివ్‌గా ఎలా ఆలోచిస్తారబ్బా.. అని నాలుక కరుచుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇక వాళ్లు ఎగ్జామ్స్‌లో రాసే ఆన్సర్లు వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇలాంటి నవ్వు తెప్పించే జవాబులు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. అఫ్‌కోర్స్‌.. చిన్న తనంలో మనం అందరం ఇలాంటి చిలిపి పనులు చేసే ఉంటాం. తాజాగా ఓ స్కూల్‌లో నిర్వహించిన పరీక్షలో ఓ విద్యార్థి రాసిన ఆన్సర్‌ చదివి ఆ టీచర్‌ ఫ్యూజులు ఎగిరిపోయాయ్‌. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. మీరూ చూసేయండి..

హిందీ టీచర్‌ ఇచ్చిన ప్రశ్నలకు విద్యార్థి పుస్తకంలో ఉండే సరైన సమాధానాలు రాయకుండా తన సొంత తెలివి తేటలు తెగ వాడేశాడు. అయితే సదరు విద్యార్థి క్రియేటివికి ముచ్చటపడిన టీచర్‌ జవాబులు సరైనవి కాకపోయినప్పటికీ 5 మార్కులు ఇచ్చింది. నీ తెలివికి ముచ్చటపడి సగం మార్కులు ఇస్తున్నాను అని ఆ జవాబు పత్రంలో రాసింది కూడా. అసలింతకీ మనోడు ఏం రాశాడంటే.. ‘సంయుక్త హల్లు రాయండి (సంయుక్త్‌ వ్యంజన్‌ లికియే)’ అని టీచర్‌ ఇచ్చిన ప్రశ్నకు.. విద్యార్థి ‘మటర్‌ పనీర్‌తో అన్ని కూరగాయల మిక్స్‌ చేసి కలిపి వండితే సంయుక్త వంటకం (మటర్‌ పనీర్‌ ఔర్‌ సబీ మిక్స్‌ సబ్జియాం సంయుక్త్‌ వ్యంజన్‌ హోతీ హై)’ అవుతుంది’ అని రాశాడు. ‘భూత కాలం అని దేనిని అంటారు..? (భూత్‌ కాల్‌ కిసే కహ్‌తే హై..?)’ అన్న మరో ప్రశ్నకు.. ‘మన గతం.. గతం రూపంలో వచ్చినప్పుడు దాన్ని భూత కాలం అంటారు (జబ్‌ భూత్‌ హమారా కాల్‌ బన్‌కర్‌ ఆతా హై తో ఉసే భూత్‌కాల్‌ కహ్తే హై)’ అని దిమ్మతిరిగే ఆన్సర్ రాశాడు.

View this post on Instagram

A post shared by Neeru prajapati 20 (@n2154j)

ఇక ‘బహువచనం అని దేనిని అంటారు..? (బహు వచన్‌ కిసే కహ్తే హై..?)’ అని టీచర్‌ ఇచ్చిన మూడో ప్రశ్నకు ‘అత్తమామల మాటలు వినే కోడలిని బహువచనం అంటారు (ససూరాల్‌ కో వచన్‌ సున్‌నే వాలీ బహు కో బహువచన్‌ కహ్తే హై)’ అని విద్యార్థి సమాధానం రాశాడు. సబ్జెక్ట్‌ పరంగా ఈ మూడు జవాబులు తప్పైనప్పటికీ పిల్లాడి తెలివితేటలకు టీచరమ్మ తెగ ముచ్చటపడిపోయింది. అంతే10 మార్కులకు గానూ టీచర్‌ 5 మార్కులు వేసేసింది. ‘ఈ 5 మార్కులు నీ తెలివి తేటలకు వేశాను’ అని టీచర్‌ జవాబు పత్రంపై రాసింది. ఇక ఈ ఆన్సర్లు చూసిన నెటిజన్లు విద్యార్ధి సెన్సాఫ్‌ హ్యూమర్‌కి పూర్తి మార్కులు వేసినా తప్పులేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.