ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్ గా ఇచ్చిన ప్రముఖ ఎయిర్ లైన్స్
కళ్లు చెదిరే లాభాలు రావడంతో ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 8 నెలలకు సమానమైన జీతాన్ని బోనస్ గా చెల్లిస్తామని తాజాగా ప్రకటించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో సుమారు రూ. 16 వేల కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్ గా చెల్లించేందుకు ముందుకొచ్చింది.
కళ్లు చెదిరే లాభాలు రావడంతో ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 8 నెలలకు సమానమైన జీతాన్ని బోనస్ గా చెల్లిస్తామని తాజాగా ప్రకటించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో సుమారు రూ. 16 వేల కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్ గా చెల్లించేందుకు ముందుకొచ్చింది. కరోనా మహమ్మారి వల్ల మూతపడిన చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ సరిహద్దులు గతేడాది పూర్తిస్థాయిలో తెరచుకున్నాయి. దీంతో ఈ మార్గాల్లో వ్యాపారం తిరిగి ఊపందుకుందని.. ఏడాదంతా విమాన ప్రయాణాలకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొంది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఇప్పటికే గతేడాదికిగాను సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఎంపికైంది. ది స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డును గెలుచుకుంది. గత 23 ఏళ్లలో సింగపూర్ ఎయిర్ లైన్స్ ఈ అవార్డు సాధించడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే ఈ అవార్డు సాధ్యమైందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ అన్నారు. విమానయాన రంగంలో తాము మరింతగా పుంజుకోవడానికి ఈ ప్రోత్సాహం దోహదపడుతుందన్నారు. ఇలా కంపెనీ ఆర్జించిన లాభాలను బోనస్ రూపంలో ఉద్యోగులకు ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలో దుబాయ్ ఎమిరేట్స్ కూడా ఇలానే 20 వారాల జీతాన్ని బోనస్‌గా అందించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెల్ల ఉల్లిపాయలు కనిపిస్తే వదలకండి.. దాని ప్రయోజనాలు తెలిస్తే షాకే
రోడ్డు పక్కన స్నాక్స్ తింటున్న అమ్మాయిలు.. అంతలోనే..
నాన్‌వెజ్ జాతర.. తిన్నవారికి తిన్నంత.. కానీ, లేడీస్ కు నో ఎంట్రీ
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా ?? ఈ విషయం తెలిస్తే ఆ పని చేయరు !!