రోడ్డు పక్కన స్నాక్స్‌ తింటున్న అమ్మాయిలు.. అంతలోనే..

ఎంతటి సాధు స్వభావులైనప్పటికీ వారిలోనూ ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇది మనుషుల స్వభావం.. ఇక జంతువుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అయితే సాధారణంగా ఆవులను సాధు జంతువులుగా మనం చూస్తాం. కానీ ఎంత సాధుజీవులు అయినప్పటికీ ఆవుల్లోనూ జంతు ప్రవృత్తి ఉంటుందనే విషయం మరోసారి నిరూపణ అయింది. ఢిల్లీలోని ఓ వీధిలో పట్టపగలే రెండు ఆవులు కుమ్ముకుంటూ షాప్ బయట కూర్చున్న ముగ్గురు యువతులపైకి హఠాత్తుగా దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.

రోడ్డు పక్కన స్నాక్స్‌ తింటున్న అమ్మాయిలు.. అంతలోనే..

|

Updated on: May 22, 2024 | 9:41 PM

ఎంతటి సాధు స్వభావులైనప్పటికీ వారిలోనూ ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇది మనుషుల స్వభావం.. ఇక జంతువుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అయితే సాధారణంగా ఆవులను సాధు జంతువులుగా మనం చూస్తాం. కానీ ఎంత సాధుజీవులు అయినప్పటికీ ఆవుల్లోనూ జంతు ప్రవృత్తి ఉంటుందనే విషయం మరోసారి నిరూపణ అయింది. ఢిల్లీలోని ఓ వీధిలో పట్టపగలే రెండు ఆవులు కుమ్ముకుంటూ షాప్ బయట కూర్చున్న ముగ్గురు యువతులపైకి హఠాత్తుగా దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. షాప్ ముందున్న సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ముగ్గురు యువతులు ఓ షాప్ బయట స్నాక్స్‌ తింటున్నారు. వారిలో ఇద్దరు కూర్చోగా మరో యువతి నిలబడింది. ఇంతలో హఠాత్తుగా రెండు ఆవులు కుమ్ముకుంటూ వారిపైకి దూసుకెళ్లాయి. దీంతో వారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. అయినా ఆవులు ఆగకుండా కుమ్ముకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఆవు గిట్టలకింద ఓ యువతి చిక్కుకుపోయింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు వెంటనే స్పందించారు. ఒకరు ఆవులను చెదరగొట్టగా మరొకరు కిందపడ్డ యువతిని పైకిలేపి పక్కకు తీసుకెళ్లారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సకాలంలో స్పందించిన యువకులను ప్రశంసించారు. అలాగే రోడ్లపై ఆవులు తిరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మంది వీక్షించారు. వీడియోపై తమదైనశైలిలో స్పందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాన్‌వెజ్‌ జాతర.. తిన్నవారికి తిన్నంత.. కానీ, లేడీస్ కు నో ఎంట్రీ

వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా ?? ఈ విషయం తెలిస్తే ఆ పని చేయరు !!

అయ్యో పాపం.. అప్పట్లో హీరోయిన్‌కు అన్ని కష్టాలా

Payal Rajput: పాయల్‌కు ప్రొడ్యూసర్ వార్నింగ్ బ్యాన్ అస్త్రం

Sai Pallavi: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా

Follow us
Latest Articles
వ్యాపారం చేయాలనుకునేవారికి సువర్ణావకాశం..!
వ్యాపారం చేయాలనుకునేవారికి సువర్ణావకాశం..!
తారక్ ఫ్యాన్స్ కి పండగే.. అనుకున్న టైమ్‌ కన్నా ముందే రానున్న దేవర
తారక్ ఫ్యాన్స్ కి పండగే.. అనుకున్న టైమ్‌ కన్నా ముందే రానున్న దేవర
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
పెరుగు పుల్లగా మారకూడదంటే ఇలా చేయండి..
పెరుగు పుల్లగా మారకూడదంటే ఇలా చేయండి..
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
పువ్వుల ప్రేమికులా.. ఈ లోయపై ఓ లుక్ వేయండి.. ఏ సీజన్ బెస్ట్ అంటే
పువ్వుల ప్రేమికులా.. ఈ లోయపై ఓ లుక్ వేయండి.. ఏ సీజన్ బెస్ట్ అంటే
సొంతింటి కల ఆ పథకంతో సాకారం.. ప్రయోజనాలతో పాటు అర్హత ఏంటంటే..?
సొంతింటి కల ఆ పథకంతో సాకారం.. ప్రయోజనాలతో పాటు అర్హత ఏంటంటే..?
మీరు ఈ తప్పులు చేస్తున్నారా? మీ వాట్సాప్‌ శాశ్వతంగా నిషేధం!
మీరు ఈ తప్పులు చేస్తున్నారా? మీ వాట్సాప్‌ శాశ్వతంగా నిషేధం!
క్యాన్సర్ రోగులు రక్తదానం చేయవచ్చా? నిపుణులు ఏమి చెప్పారంటే
క్యాన్సర్ రోగులు రక్తదానం చేయవచ్చా? నిపుణులు ఏమి చెప్పారంటే
ఇలా చేశారంటే మంచి స్టైలిష్ బ్లాక్ బియర్డ్ మీ సొంతం
ఇలా చేశారంటే మంచి స్టైలిష్ బ్లాక్ బియర్డ్ మీ సొంతం