వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా ?? ఈ విషయం తెలిస్తే ఆ పని చేయరు !!
కాస్త అలసటగా, తలనొప్పిగా అనిపిస్తే వెంటనే వేడి వేడి టీ తాగడం చాలామందికి అలవాటు. అలసిన శరీరాన్ని ఒక కప్పు టీ రీఫ్రెష్ చేస్తుంది. అయితే టీ పెట్టుకోవాలంటే కాస్త టైం పడుతుంది అనుకునేవారికి సులువైన మార్గం టీ బ్యాగ్స్. వేడి నీటిలో లేదా పాలలో టీ బ్యాగ్ ముంచితే చాలు క్షణాల్లో టీ తయారవుతుంది. అలా చేసుకున్న టీ తాగిన తర్వాతా చాలామంది ఆ టీ బ్యాగ్‌లను పడేస్తుంటారు. అయితే ఈ టీ బ్యాగ్ వల్ల ఇంట్లో చాలా రకాల ఉపయోగాలున్నాయని మీకు తెలుసా?
కాస్త అలసటగా, తలనొప్పిగా అనిపిస్తే వెంటనే వేడి వేడి టీ తాగడం చాలామందికి అలవాటు. అలసిన శరీరాన్ని ఒక కప్పు టీ రీఫ్రెష్ చేస్తుంది. అయితే టీ పెట్టుకోవాలంటే కాస్త టైం పడుతుంది అనుకునేవారికి సులువైన మార్గం టీ బ్యాగ్స్. వేడి నీటిలో లేదా పాలలో టీ బ్యాగ్ ముంచితే చాలు క్షణాల్లో టీ తయారవుతుంది. అలా చేసుకున్న టీ తాగిన తర్వాతా చాలామంది ఆ టీ బ్యాగ్‌లను పడేస్తుంటారు. అయితే ఈ టీ బ్యాగ్ వల్ల ఇంట్లో చాలా రకాల ఉపయోగాలున్నాయని మీకు తెలుసా? వాడేసిన ఆ టీ బ్యాగ్ మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం. చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు టీ బ్యాగ్‌లను ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. టీ బ్యాగ్‌ని కట్ చేసి లోపల ఉన్న టీ పొడిని బయటకు తీసి అందులో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీనితో ముఖాన్ని మసాజ్ చేసుకుని, ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత కడిగేస్తే.. మచ్చలేని ముఖం మీ సొంతం అవుతుంది. కిచెన్‌లో డస్ట్‌బిన్ ఉండటం వల్ల దుర్వాసన వస్తుంటుంది. ముఖ్యంగా వేసవి సీజన్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వాడేసిన టీ బ్యాగ్‌ని డస్ట్‌బిన్‌లో వేయండి. అన్ని వాసనలు ఇట్టే తొలగిపోతాయి. ఇంట్లో సువాసనలు వెదజల్లడానికిఖరీదైన ఎయిర్ పాకెట్స్ కొనాల్సిన పనిలేదు. చేతిలో టీ బ్యాగ్ ఉంటే చాలు. రూమ్ ఫ్రెషనర్ కొనాల్సిన అవసరం ఉండదు. ఉపయోగించిన టీ బ్యాగ్‌ని ఆరబెట్టి, మీకు నచ్చిన ఎసెన్షియల్ నూనె కొన్ని చుక్కలను అందులో వేయండి. ఇప్పుడు ఈ టీ బ్యాగ్‌లను బాత్రూంలో లేదా ఇంట్లో ఏదైనా ఓ ప్రదేశంలో ఉంచితే గదంతా ఫ్రెష్‌గా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో పాపం.. అప్పట్లో హీరోయిన్‌కు అన్ని కష్టాలా
Payal Rajput: పాయల్‌కు ప్రొడ్యూసర్ వార్నింగ్ బ్యాన్ అస్త్రం
Sai Pallavi: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

