ఆ మహిళ పొట్టలో రాళ్లు కాదు.. రాళ్ల గుట్టే ఉంది

ఆ మహిళ పొట్టలో రాళ్లు కాదు.. రాళ్ల గుట్టే ఉంది

Phani CH

|

Updated on: May 23, 2024 | 1:50 PM

సాధారణంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారిని చూశాం. కానీ ఓ మహిళ కడుపులో ఏకంగా రాళ్లగుట్టే పేరుకుపోయింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లి చెక్‌ చేయించుకోగా షాకింగ్‌ విషయం బయటపడింది. ఆమె కడుపులో ఏకంగా వందలకొద్దీ రాళ్లు గుర్తించారు వైద్యులు. ఆపరేషన్‌ చేసి వాటిని తొలగించారు. మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటన అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.

సాధారణంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారిని చూశాం. కానీ ఓ మహిళ కడుపులో ఏకంగా రాళ్లగుట్టే పేరుకుపోయింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లి చెక్‌ చేయించుకోగా షాకింగ్‌ విషయం బయటపడింది. ఆమె కడుపులో ఏకంగా వందలకొద్దీ రాళ్లు గుర్తించారు వైద్యులు. ఆపరేషన్‌ చేసి వాటిని తొలగించారు. మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటన అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అల్లవరం మండలం దేవగుప్తంకు చెందిన జాలెం నరసవేణి అనే 31 సంవత్సరాల మహిళ గత కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధ పడుతోంది. చికిత్సకోసం అమలాపురం లోని ASA ఆస్పత్రిలో చేరింది. అక్కడ మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో గుట్టగా పేరుకుపోయిన రాళ్లను గుర్తించి వెంటనే అత్యవసరంగా సర్జరీ చేసి 570 రాళ్లను తొలగించారు. ఇంత పెద్ద సంఖ్యలో కడుపులో రాళ్లు ఉండటం చాలా అరుదు అంటున్నారు వైద్యులు. సరైన సమయంలో ఆపరేషన్ చేయడం వల్ల మహిళకు ఎలాంటి ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరిగిన చికెన్‌ ధర