నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరిగిన చికెన్‌ ధర

ఆదివారం వచ్చిందంటే నాన్‌వెజ్‌ ప్రియులకు పండగే. మార్కెట్‌లో చేపలు, చికెన్‌, మటన్‌ షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతాయి. అయితే తాజాగా అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చికెన్‌ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో భారీగా పెరిగిన చికెన్ ధర మాంసాహార ప్రియులకు షాక్ ఇస్తోంది. గత వారం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 250 నుంచి 280 రూపాలయ మధ్యలో ఉంది. ఇప్పుడు అది ఏకంగా రూ. 300కు చేరుకుంది.

నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరిగిన చికెన్‌ ధర

|

Updated on: May 23, 2024 | 1:49 PM

ఆదివారం వచ్చిందంటే నాన్‌వెజ్‌ ప్రియులకు పండగే. మార్కెట్‌లో చేపలు, చికెన్‌, మటన్‌ షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతాయి. అయితే తాజాగా అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చికెన్‌ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో భారీగా పెరిగిన చికెన్ ధర మాంసాహార ప్రియులకు షాక్ ఇస్తోంది. గత వారం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 250 నుంచి 280 రూపాలయ మధ్యలో ఉంది. ఇప్పుడు అది ఏకంగా రూ. 300కు చేరుకుంది. మరో 15 రోజులపాటు చికెన్ ధర ఇలాగే ఉంటుందని వ్యాపారులు చెపుతున్నారు. ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిందని, కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని తెలిపారు. జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మరోవైపు గుడ్డు ధర కూడా పెరిగిపోయింది. గుడ్డు ఒకటి రూ.6 రూపాయలు పలుకుతోంది. పెరిగిన చికెన్ ధరలతో రీటైల్ చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. వినియోగదారులు చికెన్ షాపులకు వెళ్లడాన్ని తగ్గించేశారు. బిజినెస్ తగ్గడంతో చికెన్ రీటైల్ వ్యాపారులు కూడా డీలా పడిపోతున్నారు. మొన్నటి వరకు రోజుకు 20 కిలోల చికెన్ అమ్మేవాళ్లు..ఇప్పుడు 10 కిలోలు మాత్రమే సేల్ అవుతోందని లబోదిబోమంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Driving License: ఎక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటే.. అక్కడే లైసెన్స్.. జూన్ 1 నుంచే అమల్లోకి

ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్‌ గా ఇచ్చిన ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌

తెల్ల ఉల్లిపాయలు కనిపిస్తే వదలకండి.. దాని ప్రయోజనాలు తెలిస్తే షాకే

రోడ్డు పక్కన స్నాక్స్‌ తింటున్న అమ్మాయిలు.. అంతలోనే..

నాన్‌వెజ్‌ జాతర.. తిన్నవారికి తిన్నంత.. కానీ, లేడీస్ కు నో ఎంట్రీ

Follow us
Latest Articles